సౌత్ స్టార్ బ్యూటీగా మరో రికార్డ్ సొంతం చేసుకున్న సమంత.. ఆమె రియాక్షన్ ఇదే..?!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా భారీపాపలారిటి దక్కించుకొని దూసుకుపోతున్న వారిలో సమంత ఒకటి. ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న బ్రేక్ తీసుకున్న స్యామ్ మళ్ళీ సినిమాలతో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం తన సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ చిన్నది.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ అభిమానులకు మరింత చేరువైంది. ఈ క్రమంలో ఈమె క్రేజ్‌ మరింతగా పెరిగింది.

Samantha Ruth Prabhu Latest News, Photos, Videos and Analysis- Indiatoday

ఇప్పటికే పలు సర్వేల్లో మోస్ట్ పాపులర్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ గా మొదటి స్థానాన్ని దక్కించుకున్న‌ సమంత.. తాజాగా ఐఎండిబి జాబితాలో కూడా మంచి చోటు సంపాదించుకుంది. తాజాగా ఐఎండిబి రిలీజ్ చేసిన టాప్ 100 మోస్ట్ ఇండియన్ స్టార్స్ జాబితాలో ఈ అమ్మడు 13వ స్థానాన్ని దక్కించుకుంది. దీనిపై ఇటీవల సమంత ఓ నేషనల్ మీడియాతో ముచ్చటించింది. ఇందులో సమంత మాట్లాడుతూ తను 13వ స్థానాన్ని సంపాదించడం చాలా ఆనందంగా ఉందని.. ఇది నా కష్టానికి దక్కిన ఫలితం అంటూ వివరించింది.

@Teamtwts2's video Tweet

నా సినీకేరీర్‌ ఇప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుందని.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇన్నేళ్ల ప్రయాణం అస్సలు తెలియలేదని వివరించింది. ప్రస్తుతం మంచి సినిమాల్లో నటించే ఛాన్సులు వస్తున్నాయని చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ‌ ఇప్పుడు వచ్చిన ఈ సక్సెస్ నాకు మరింత బాధ్యత పెంచింది. ఇకపై ఇంకా ఎక్కువగా కష్టపడి పనిచేస్తా అంటూ వివరించింది. ఐఎండిబి జాబితాలో టాప్ 15 లో ఉన్న ఏకైక సౌత్ స్టార్ సమంతనే కావడం విశేషం. ఈ జాబితాలో దీపిక పదుకొనే మొదటి స్థానంలో నిలిచారు. ఇక 16, 18 స్థానాల్లో తమన్న, నయనతార చోటు ద‌క్కించుకున్నారు.