రజినీకాంత్, సత్యరాజ్ మధ్య విభేదాలపై.. కట్టప్ప క్లారిటీ..?!

రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన బాహుబలి తో కట్టప్ప పాత్రలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సత్యరాజ్. అయితే గత కొంతకాలంగా సత్య రాజ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో తలైవార్ రజనీకాంత్ కు మధ్యన మనస్పర్ధలు ఉన్నాయంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల సత్యరాజు దీనిపై స్పందించాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటు క్లారిటీ ఇచ్చాడు. గతంలో తాను రజనీకాంత్ సినిమాను అంగీకరించక‌పోవ‌డానికి కారణం ఇదేనంటూ చెప్పుకొచ్చాడు.

Actor Sathyaraj Speech At Prince Pre Release Event | Actor Sathyaraj Speech  | Prince Pre Release Event: హీరోయిన్ మరియాపై సత్యరాజ్ ప్రశంసలు | ABP Desam

నేను ఇండస్ట్రీకి వచ్చాక రజనీకాంత్‌తో ప‌లు సినిమాల‌లో న‌టించాన‌ని.. అయితే గ‌తంలో రెండు సినిమాల్లో అవ‌కాశాలు వచ్చిన పాత్రలు నచ్చకపోవడంతో ఆ సినిమాలను రిజెక్ట్ చేశానని.. అంతేకానీ వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవంటూ స్పష్టం చేశాడు. ఇక వీళ్లిద్దరూ కలిసి 38 ఏళ్ల తర్వాత లోకేష్ కనగ‌రాజ్ డైరెక్షన్లో వస్తున్న కూలి సినిమాతో కలిసి నటించనున్నారు. అయితే ఈ మూవీలో త‌న పాత్ర పై మాత్రం ఇప్పుడే చెప్ప‌లేన‌ని.. మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసే వరకు వేచి చూడాలంటూ వివరించాడు.

Ahead Of 'Coolie' Release, Sathyaraj Talks About Alleged Feud With  Rajinikanth; Here's What He Said

1986లో కావేరి జల వివాదం సందర్భంగా సత్యరాజ్ రజినీకాంత్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వీరిద్దరి మధ్యన సఖ్యత లేదని.. వీరిద్దరి మధ్యన ఉన్న వివాదాలు తోనే కలిసి నటించడం లేదంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కాగా తాజాగా వీళ్ళిద్దరిని తన కథతో మెప్పించి కూలి సినిమాలో కలిసి నటించేలా చేశాడు లోకేష్. ఇందులో సత్యరాజ్.. రజనీకాంత్ స్నేహితుడిగా కనిపించనున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. ఇక రజనీకాంత్ నటించిన ఈ కూలి సినిమాలో సత్యరాజ్ తో పాటు కమలహాసన్ ఓ కీలక పాత్రలు నటించనున్నాడు. ఈ మూవీలో రజనీకాంత్ జోడిగా శోభన నటిస్తుంది.