‘ పుష్ప 2 ‘ పై సుకుమార్ గూస్ బంప్స్ అప్డేట్.. ఆ ఒక్క సీన్‌కు విజిల్స్ పడడం పక్క అంటూ..?!

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న ఈయన.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి తన‌ను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ క్రమంలో ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉంటే సుకుమార్ లాంటి డైరెక్టర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కడంతో సినిమాపై మరింత హైప్‌ పెరిగింది.

Pushpa 2 The Rule's The Couple Song: Allu Arjun, Rashmika Mandanna groove  to upbeat track with director Sukumar | Telugu News - The Indian Express

ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప 2 కోసం బాలీవుడ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజై ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి. సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈ క్రమంలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు మరింత ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన ఓ గూస్ బంప్స్ అప్డేట్ అందించాడు సుకుమార్.

The North-Eastern Chronicle | Allu Arjun's much-anticipated film, "Pushpa:  The Rule," has taken the internet by storm with the release of its first  look poster for... | Instagram

ఈ సినిమా మొత్తం ఎలా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక్క సీన్ కు మాత్రం ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చుని మరి ఎంజాయ్ చేస్తారని.. కచ్చితంగా ఆ సీన్ కు విజిల్స్ పడడం ఖాయం అంటూ వివరించారు. ఇక మొత్తానికి అయితే ఈ సినిమాతో తెలుగు సినిమా రేంజ్‌ను మ‌రింత‌గా పెంచాలని ప్రయత్నంలో ఉన్నారు బన్నీ, సుకుమార్. ఇక ఈ మూవీ రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో అనే ఆసక్తి పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల్లో మొదలైంది.