కోలీవుడ్ తలైవార్ రజనీకాంత్ టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక్కడ కూడా భారీ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో రజనీకాంత్‌కు స్ట్రాంగ్ త్రో బ్యాక్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా రూ.500 కోట్ల భారీ వసూలు రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తీయనన్నారు. అందుకోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్.
ఇక తాజాగా ఈ సీక్వెల్‌పై ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ వైరల్‌గా మారింది. నందమూరి మాస్ హీరో జైలర్ 2 లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు అంటూ తెలుస్తుంది. ఇంతకీ ఆయన ఎవరు.. ఆయన నటించబోతున్న పాత్ర ఏంటో ఒకసారి తెలుసుకుందాం. నందమూరి నటసింహ బాలకృష్ణ ఈ సినిమాల్లో గెస్ట్ రోల్ లో నటించబోతున్నాడట. ఓ పవర్‌ఫుల్ గ్యాంగ్ స్టార్‌గా ఆయన పాత్ర క్లైమాక్స్‌లో కీలకంగా ఉండబోతుందని సమాచారం. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రలో మెప్పించనున్న సంగతి తెలిసిందే.
వారి పాత్రలకు ప్రేక్షకుల్లో ప్రశంసలు అందాయి. ఈ క్రమంలో సీక్వెల్‌లో బాలకృష్ణ గెస్ట్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ సినిమాతో బిజీగా ఉన్నాడు. బాబి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ క్రమంలో బాలకృష్ణ, రజనీకాంత్ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారంటూ వార్తలు వైరల్ అవడంతో వీళ్ళిద్దరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.