నటి హేమకు మరో బిగ్ షాక్.. ప్రమాదంలో సినీ కెరీర్.. మ్యాటర్ ఏంటంటే..?!

గత కొంతకాలంగా బెంగ్‌ళూరు రేవ్ పార్టి వివాదం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో భారీ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ రేవ్‌ పార్టీలో 150 కి పైగా తెలుగు వారు ఉండడంతో తెలుగు మీడియాలో కూడా ఈ వార్త వైరల్ గా మారింది. అయితే ఈ రేవ్ పార్టీ వివాదంలో టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ పేరు బాగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో హేమ కూడా ఉన్నట్టు వార్తలు రావ‌డ‌డంతో ఆమె నేను ఏ రేవ‌ట్ పార్టీకి వెళ్లలేదని.. నా ఫామ్ హౌస్‌లో చిల్ అవుతున్నాను అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. వీడియో రిలీజ్ చేసిన కొద్దిసేపటికి బెంగళూరు పోలీసులు కీలక ఆధారాలతో ఆమె రేవ్‌ పార్టీలో పాల్గొన్నని బయటపెట్టారు. అయినా ఆమె ఎప్పటికప్పుడు ఆ రేవ్‌ పార్టీకి తనకి ఏం సంబంధం లేదంటూ బుకాయిస్తూనే వచ్చింది.

అయితే ఇది చాలా హై ప్రొఫైల్ పరిధిలో ఉన్న కేస్ కావడంతో.. మీడియా సోషల్ మీడియాలో కూడా ఈరేవ్‌ పార్టీ గురించి విస్తృతంగా వార్తలు వైర‌ల్ అయ్యాయి. కర్ణాటక ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఇరుక్కున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదంటూ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు నగర పోలీసులు కమిషనర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేప‌ట్టారు. ఇప్పటికే 70 మందిని అనుమానితులుగా నిందితుల జాబితాలో చేర్చి వారి శరీరంలో రక్త నమూనాల్లో.. డ్రగ్స్ పాజిటివ్ గా తేలినట్లు నిర్ధారించింది. ఈ క్రమంలో మాదకద్రవ్యాలు సరఫరా చేసింది ఎవరు..? ఈ పార్టీని ఎవరు నిర్వహించారు..? ఎవరెవరు ఆ పార్టీకి హాజరయ్యారు..? ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు..? ఈవెంట్లో పాల్గొనడానికి ఎంత మనీ పే చేశారు..? అనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఈ క్రమంలో రేవ్ పార్టిలో హేమ కూడా డ్రగ్స్ తీసుకుందంటూ రక్త నమూనాలతో నిర్ధారించబడింది. దీంతో హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నారని.. మా లో ఆమె సభ్యత్వాన్ని కోల్పోనుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనన్నాడట. వాస్తవానికి ఈ పార్టీలో తాను లేనని చెప్పిన చివరికి ఆమె ఉందని తేలడంతో ఇప్పటివరకు ఆమె చెప్పిన‌వ‌ని అబద్ధాల‌ని తెలిసిపోయింది. ఇక ప్రస్తుతం బెంగళూరు పరావన అగ్రహారం జైల్లో విచారణ ఖైదీగా ఉంది.