“మా మామయ్య ఎమ్మెల్యే కాదురోయ్”.. సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్న సాయి ధరమ్ తేజ్ పోస్ట్(వీడియో)..!

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోతుంది . ఏపీలో కూటమి భారీ విజయం సాధించడం.. పైగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఎక్కడైతే పోటీ చేసిందో.. అక్కడ 21 మందికి 21 మంది గెలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలోనే సంచలనంగా మారింది. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పిఠాపురం ఎమ్మెల్యే అంటూ హ్య్స్ష్ ట్యాగ్స్ ని కూడా ట్రెండ్ చేస్తున్నారు .

పవన్ విజయాన్ని మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది . మరీ ముఖ్యంగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నిన్న పవన్ ఇంటికి వెళ్లి మరి ఆయనను ఎత్తుకొని గాల్లోకి తిప్పేసి మరి సంతోషం వ్యక్తం చేశాడు . ఈ వీడియో కూడా బాగా వైరల్ గా మారింది . పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ పోస్టులు కూడా చేయడం గమనార్హం. తాజాగా ఓ వీడియో మీమ్ తో ఫన్నీ పోస్ట్ చేశాడు సాయిధరమ్ తేజ్.

సరదా గా మీమ్ రిప్లై ఇస్తూ ..”మా మామయ్య ఎమ్మెల్యే కాదు.. మీ ఎమ్మెల్యే మీ అందరికీ శిరస్సు వంచి కోటి దండాలు ” అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు . ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలోని ఒక సీన్ వీడియోను రీ క్రియేట్ చేస్తూ సాయిధరమ్ తేజ్ పంజా వైష్ణవ తేజ్ ఫేసులను మార్ఫ్ చేస్తూ ..”మా మామయ్య ఎమ్మెల్యే ” అనే డైలాగ్ను బాగా ట్రెండ్ చేశారు . దీనికి సాయి ధరంతేజ్ రిప్లై ఇవ్వడం గమనార్హం. ప్రెసెంట్ ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!