ప్రభాస్ “కల్కి 2898AD” సినిమా ట్విట్టర్ రివ్యూ: నాగ్ అశ్వీన్ మెంటల్ ఎక్కించే మాస్ ప్రపంచం..ఊహకందని క్లైమాక్స్..!

నాగ్ అశ్వీన్.. అనంతపని చేశాడు ..తన విజన్ తో రాబోయే ప్రపంచం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు . ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది .ఇప్పటికే సినిమా చూసిన జనాలు ట్విట్టర్ వేదికగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూ కల్కి సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేసేసారు . కాగా సినిమా ఓ రేంజ్ లో ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉండడం కల్కి సినిమాకు భారీ హైప్ ఇచ్చింది .

నాగ్ అశ్వీన్ అద్భుత ప్రపంచాన్ని చూపించారు అని .. మనల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్లారు అని .. కచ్చితంగా ఈ సినిమా బాహుబలికి మించిన రేంజ్ లో హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మన పురాణాలను నేటి ఆధునిక ప్రపంచానికి కంబైన్ చేసి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే విషయాలను నాగ్ అశ్విన్ చాలా చక్కగా తెరపై చూపించాడు అంటూ పలువురు పెద్దలు కూడా ప్రశంసిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు అవసరం అంటూ కూడా నాగ్ అశ్వీన్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక్కొక్క సీన్ ఎంత పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు అంటే ఎక్కడ నెగిటివిటీ అనే లైన్ లేకుండా చేసుకున్నాడు . సినిమాలో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది అని ఏదో పిచ్చిపిచ్చిగా గ్రాఫిక్స్ కాకుండా సినిమాకి ఎంత అవసరమో అదే విధంగా గ్రాఫిక్స్ ని పెట్టారు అని .. 600 కోట్ల బడ్జెట్ తో అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించడం చాలా చాలా గ్రేట్ అని పొగడేస్తున్నారు. సినిమాలో ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రకు తగిన న్యాయం చేశారు అని ..దీపికా పదుకొనే – దిశా పటాన్ని – అమితాబచ్చన్ – కమలహాసన్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటించడం కూడా సినిమాకి మరింత ప్లస్ గా మారింది అని చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?