దేవర సినిమా షూటింగ్ స్పాట్ నుంచి సెన్సేషనల్ పిక్స్ లీక్.. కేక పెట్టిస్తున్న ఎన్టీఆర్ న్యూ నయా లుక్..!!

సినిమా ఇండస్ట్రీలో .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా షూటింగ్స్ స్పాత్స్ నుంచి కొన్ని కొన్ని పిక్స్ లీక్ అవుతూ ఉన్నాయి . అయితే కొంతమంది ఫ్యాన్స్ తమ ఫేవరెట్ స్టార్ హీరో సినిమాలకు సంబంధించిన పిక్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం స్టార్ సెలబ్రిటీసే ఆ షూటింగ్స్ స్పాట్ నుంచి కొన్ని కొన్ని పిక్స్ ను లీక్ చేసేస్తూ ఉంటారు . తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకి సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

మనకు తెలిసిందే దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ . ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ సెన్సేషనల్ మూవీ నే ఈ దేవర . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగులో డెబ్యూ ఇవ్వబోతుంది . కాగా ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ థాయిలాండ్ లో జరుగుతుంది . రీసెంట్ గానే ఎన్టీఆర్ థాయిలాండ్ వెళ్ళాడు. ఈ సినిమాలో స్పెషల్ పాట కోసం బాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టీస్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు ,

బాస్కో మార్టీస్.. ఈ ఫొటోస్ ని స్వయంగా షేర్ చేయడం గమనార్హం. ఈ ఫోటోలో ఎన్టీఆర్ లుక్ కెవ్వు కేక అనే రేంజ్ లో ఉంది. ” ఎన్టీఆర్ గారితో దేవరకు వర్క్ చేస్తున్నాను.. నా కెరియర్ లోనే స్పెషల్ అంటూ” పోస్ట్ చేశాడు . దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు అద్దిరిపోయే రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . మా ఎన్టీఆర్ దగ్గర సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోయే స్టెప్స్ వేయించండి సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Bosco Martis (@boscomartis)