పవన్ పోలిటికల్ పవర్..బన్నీకి బిగ్ షాకిచ్చిన సాయి ధరమ్ తేజ్..ఏమైందంటే..?

ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీని ఏ విధంగా జనాలు ట్రోల్ చేస్తున్నారో మనం చూస్తున్నాము. దానికి కారణం ఏంటి అనేది కూడా మనకి బాగా తెలుసు. మరి ముఖ్యంగా తన మామయ్య జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత జనసేన టిడిపికి ప్రత్యర్థి పార్టీగా ఉన్న వైసీపీకు సపోర్ట్ చేస్తూ వైసిపి కాండిడేట్ శిల్పా రవికి సపోర్ట్ చేశాడు బన్నీ . అప్పటినుంచి సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ పవన్ ఫ్యాన్స్ బన్నీపై విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు.

అంతేనా బన్నీ సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోవడం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం .. బన్నీకు భారీ బొక్క పడేలా చేసింది . అయితే పవన్ కళ్యాణ్ గెలిచినందుకు బన్నీ విష్ చేసిన కూడా ఫాన్స్ సాటిస్ఫై అవ్వలేదు. అంతేనా మెగా ఫ్యామిలీ గ్రాండ్గా ఇచ్చిన వెల్కమ్ సెలబ్రేషన్స్ లో సైతం అల్లు ఫ్యామిలీ మిస్ అయింది. నేడు ఏపీ మినిస్టర్గా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా అల్లు ఫ్యామిలీ మిస్ అయింది . దీంతో సోషల్ మీడియాలో రకరకాలుగా జనాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీను ట్రోల్ చేస్తున్నారు.

ఇదే క్రమంలో తెరపై మరొక న్యూస్ వైరల్ గా మారింది . అల్లు అర్జున్ ని మెగా హీరో సాయి ధరంతేజ్ ఇన్స్టాలో అన్ ఫాలో చేశాడు అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. స్నేహ రెడ్డిని అదేవిధంగా అల్లు అర్జున్ ను సాయిధర్మతేజ్ ఇన్స్టాలో అన్ఫాలో చేసినట్లు వార్త బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ మెగా ఫాన్స్ మాత్రం వెరీ గుడ్ సాయిధరమ్ తేజ్ అంటూ పొగిడేస్తున్నారు . పవన్ కళ్యాణ్ పొలిటికల్ కారణంగానే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగింది అంటూ ప్రచారం జరుగుతుంది . దీని పై ఎటువంటి అధికార సమాచారం లేనప్పటికీ ఈ న్యూస్ మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది..!!