పాజిటివ్ టాక్ తో ‘ కల్కి 2898 ఏడి ‘.. టీం మెంబర్స్ ను ట్యాగ్ చేస్తూ నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..?!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి క‌ల్కి ఈ పేరే వినిపిస్తుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందించాడు. ఇప్పటికే పలువురు సినీ ప్ర‌ముకులు ఈ సినిమాకి సంబంధించి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ టీంకు విషెస్ తెలియ‌జేశారు. తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కల్కి సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ ఆశ‌క్తి క‌ర ట్వీట్ చేశాడు. కల్కి సినిమా గురించి అద్భుతమైన రివ్యూస్ వినడం చాలా ఆనందంగా ఉందంటూ త‌న ట్విట‌ర్ వేదిక‌గా ఆయ‌న రాసుకొచ్చాడు.

Nara Lokesh: కల్కి 2898 ఏడీకి పాజిటివ్ రెస్పాన్స్..కంగ్రాట్స్ చెబుతూ నారా లోకేష్ ట్వీట్ - NTV Telugu

ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే అందరికీ పేరుపేరున ట్యాగ్ చేసి మ‌రీ కంగ్రాట్యులేషన్స్ తెలియ‌జేసాడు. అలాగే క‌ల్కి సినిమా ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసే సినిమాగా ఒక మాస్టర్ పీస్ గా తెరకెక్కించినందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి నా ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు అశ్విని దత్ కి స్పెషల్ అప్రిషియేషన్ దక్కాలని విరించాడు. స్వప్న, ప్రియాంక తెలుగు సినిమాకి కట్టుబాట్లను చెరిపి తెలుగు సినిమాని గ్లోబల్ లీగ్ లోకి తీసుకెళ్ళేందుకు బాగా కృషి చేశారని నారా లోకేష్ కామెంట్ చేశారు.

Mahanati Team Receives Appreciation From Chiranjeevi

అశ్వినీ దత్ ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుడుగా వ్యవహరిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సమయంలో కూడా ఆయన జైలుకు వెళ్లి పరామర్శించి తెలుగుదేశానికి అండగానే ఉంటామంటూ వివ‌రించాడు. ఇక ఆయన నిర్మించిన సినిమాకి హిట్ టాక్ రావడంతో నారా లోకేష్ త‌న అభినందన‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.