కల్కి సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ కొన్ని కొన్ని సీన్స్ విషయంలో హర్ట్ అయినట్లు తెలుస్తుంది. వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో దిశా పటాని – దీపికా పదుకొనే హీరోయిన్లుగా ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి 2898 ఏడి. కమల్ హాసన్ – అమితాబచ్చన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి ఫుల్ పాజిటివ్ టాక్ దక్కించుకుంది . మొదటి నుంచి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం ఆ ఎక్స్పెక్టేషన్స్ని అదే రేంజ్ లో రీచ్ కావడం ..ఈ సినిమాని నాగ్ అశ్వీన్ తనదైన స్టైల్ లో డైరెక్షన్ వహించడం బిగ్ ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి .
అయితే సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ ప్రభాస్ ఫాన్స్ ను డీప్ గా హర్ట్ చేశాయి . మరీ ముఖ్యంగా సినిమా స్టార్ట్ అయిన చాలా టైం తర్వాత ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఉండడం.. అదేవిధంగా శంబల నగరానికి సంబంధించిన కాంప్లెక్స్ ను ఎక్కువగా ఫోకస్ చేస్తూ హైలెట్ చేసి చూపించడం .. ఆ తర్వాత అశ్వద్ధామ చేతిలో ప్రభాస్ లాంటి స్టార్ హీరో ను పదేపదే దెబ్బలు తినేలా నాగ్ అశ్వీన్ కొన్ని సీన్స్ తెరకెక్కించడం..అప్పటికే లాంగ్ లెన్త్ సీన్స్ తో కన్ఫ్యూషన్ గా మారిపోయిన కొన్ని సీన్స్ లో తలా తోక లేని లాజిక్ తో నాగ్ అశ్విన్ క్ల్మబ్సీ సీన్స్ మెర్గ్ చేయడం ..
ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ కామెడియన్ బ్రహ్మానందం ని కేవలం కొన్ని సినిమాలకే పరిమితం చేయడం .. మరి ముఖ్యంగా ఆయనలోని కామెడీ యాంగిల్ ని బయట పెట్టుకోలేకపోవడం .. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి . సినిమాకి ఈ సీన్స్ కొంచెం నెగిటివ్ టాక్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి అంటూ అభిప్రాయపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . సోషల్ మీడియాలో ఇప్పుడు దీనికి సంబంధించిన వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు . అయితే నెగిటివ్ కామెంట్స్ కన్నా పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉండడం గమనార్హం..!!