ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పుష్ప2కి సంబంధించిన వార్తలు మనం ఎక్కువగా వింటున్నాము. మరీ ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవ్వాల్సిన పుష్ప2 సినిమా ఏకంగా డిసెంబర్ 6 వాయిదా పడడం ఫ్యాన్స్ కి హర్టింగ్ గా అనిపించింది . అంతేకాదు ఈ సినిమా విషయంలో సుకుమార్ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా.. కొన్ని కొన్ని మాత్రం ఆయనకు ఇబ్బందికర సిచువేషన్ క్రియేట్ చేస్తున్నాయి .
ఈ సినిమా షూటింగ్ టైంలో సుకుమార్ తన ఐఫోన్ ని పగలకొట్టాడు అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాసిన వార్త ప్రకారం.. సుకుమార్ ఈ సినిమా షూట్ లో తన కాస్ట్లీ ఐఫోన్ను కోపంతో నేలకేసి కొట్టేసాడట. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ సీన్ ను చిత్రీకరిస్తున్నారట . ఆల్రెడీ 40 టేకులకు పైగానే తీసుకున్నారట . ఒకసారి ఒక నటుడు బాగా నటిస్తే ఇంకొకసారి ఇంకొక నటుడు బాగా నటించకపోవడం ..
ఆయన అనుకున్నంత క్వాలిటీగా ఈ సీన్స్ రాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన సుకుమార్ .. ఎదుటివాళ్లను ఏమీ అనలేక తన కాస్ట్లీ ఐఫోన్లు పగలగొట్టేసారట . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో పుష్ప2కి సంబంధించిన ఈ వార్త ఫుల్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి పుష్ప 2 కి ఏదో దిష్టి తగిన్నట్లుంది… ఇలా ఒకదాని తరువాత ఒకటి బ్యాడ్ జరుగుతూనే ఉంది..!!