ఆ హీరో-హీరోయిన్ పెళ్లి చేసుకుంటే ..సమంత-నాగచైతన్య లాగే విడిపోతారా.. ? ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో పలువురు జనాలు ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో సినీ కపుల్స్ ఎక్కువగా మారిపోతున్నారు . హీరో హీరోయిన్లు ఏదైనా సినిమా చేసే మూమెంట్ లోనే ప్రేమించుకోవడం పెళ్లిళ్లు చేసుకోవడం చేస్తున్నారు . అయితే పట్టుమంటూ పదికాలాలపాటు కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకుంటున్నారు. చాలామంది స్టార్ సెలబ్రెటీస్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే .

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ ఈ హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటే నాగచైతన్య సమంత లాగా విడాకులు తీసుకుంటారు అంటూ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు మరెవరో కాదు విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్స్ గా మారి కెరియర్ లో సెటిల్ అవుతున్న రష్మిక మందన్నా..విజయ్ దేవరకొండల మధ్య ప్రేమాయణం ఉంది అంటూ ఏ విధంగా వార్తలు వినిపిస్తున్నాయో మనకు తెలిసిందే.

ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ తెగ ప్రచారం జరుగుతుంది . విజయ్ దేవరకొండ రష్మిక అయితే ఈ విషయాని కొట్టిపడేస్తున్నారు. వీళ్ళిద్దరి జాతకం కలవదు అని వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా విడాకులు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి చెప్పిన మాటలను మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు జనాలు. ప్రసెంట్ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ గా మారిపోయారు..!!