అమ్మ బాబోయ్ ..బోయపాటి లో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఇన్నాళ్లు బయట పెట్టలేదే..?

చాలామంది అనుకుంటూ ఉంటారు డైరెక్టర్స్ కి కేవలం డైరెక్షన్ చేసే టాలెంట్ మాత్రమే ఉంటుంది అని.. కానీ కాదు కొంతమంది డైరెక్టర్స్ మల్టీ టాలెంటెడ్ ..డాన్సులు బాగా చేస్తారు .. డైలాగ్స్ అవలీలగా చెప్పేస్తారు.. క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది .. మరి కొంతమంది పాటలు కూడా పాడుతారు . అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న బోయపాటి శ్రీను కు సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది .

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బోయపాటి శ్రీను లో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అంటూ రీసెంట్గా ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. బోయపాటి శ్రీను మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ అట. ఆయనలో మంచి డ్రాయింగ్స్ స్కిల్స్ ఉన్నాయట. ఈ విషయాన్ని బయటకు పెద్దగా చెప్పుకోడట. కానీ కుటుంబ సభ్యుల ముందు ఫ్రెండ్స్ ముందు బయట పెడుతూ ఉంటారట . ఈ విషయం బాలయ్య కూడా బాగా తెలుసట .

బాలయ్య బోయపాటి మంచి జాన్ జిగిడి దోస్తులు. ప్రజెంట్ వీళ్ళ కాంబోలో ఒక సినిమా వస్తుంది . ఆల్రెడీ ఇప్పటికే వీళ్ళు కలిసి వర్క్ చేసిన మూడు సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. నాలుగోసారి జతకడం నాలుగోసారి వీళ్ళ కాంబోలో సినిమా రాబోతూ ఉండడంతో జనాలు హ్యుజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే కష్టపడడానికి సిద్ధపడ్డారు బాలయ్య బోయపాటి శ్రీను అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!