మెగా ఫ్యాన్స్ ని వరుణ్ తేజ్ హర్ట్ చేసే నిర్ణయం తీసుకున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పేర్లు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోయాయో మనం చూస్తున్నాం . కాగా రీసెంట్గా లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకొని మెగా ఇంటి కోడలుగా రాజ్యమేలేస్తుంది .
అయితే రీసెంట్ గా లావణ్య త్రిపాఠి సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయకపోవడానికి కారణం మెగా ఫ్యామిలీనే అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . మెగా ఫ్యామిలీ పెట్టిన కండిషన్స్ కారణంగానే లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరంగా ఉంది అంటూ ప్రచారం జరిగింది. దీంతో వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారట . స్వయంగా వరుణ్ తేజ్ కొంతమంది డైరెక్టర్స్ తో మాట్లాడి లావణ్య త్రిపాఠికి ఆఫర్స్ ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారట .
లావణ్య త్రిపాఠి ఏ రీజన్ తో సినిమాలు చేయడం లేదో తెలియదు కానీ ఇప్పుడు వరుణ్ తీసుకున్న నిర్ణయం మాత్రం అభిమానులకు కొత్త డౌట్లు పుట్టిస్తుంది. అంటే ఫ్యామిలీ పరువు పోతుంది అన్న క్రమంలోనే ఇలా లావణ్య త్రిపాఠితో సినిమాలు చేయిస్తున్నావా..? నీకు భార్య కెరియర్ కంటే కుటుంబం పరువు ఇంపార్టెంట్ నా..?అనే రేంజ్ లో కొందరు ట్రోల్ చేస్తుంటే .. మరికొందరు లక్షణంగా ఉన్న జంటపై ఎందుకు మీకు ఇంత కోపం .. కసి అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు..!