వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా..? నెలకు అన్ని కోట్లు సంపాదిస్తాడా..?

వరలక్ష్మి శరత్ కుమార్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది. కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కూతురే ఈ వరలక్ష్మి శరత్ కుమార్. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . పలు సినిమాలలో నటించింది తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అయితే ఆ తర్వాత ఆమె బాడీ కట్ అవుట్ హీరోయిన్ గా కన్నా విలన్ రోల్స్ కే బాగా సూట్ అవుతుంది అని అనిపించినట్లు ఉంది . ఆ తర్వాత తనలోని నెగిటివ్ షేడ్స్ ని బయటపెట్టింది.

ఆశ్చర్యం ఏంటంటే .. పాజిటివిటీ కన్నా నెగెటివిటీ క్యారెక్టర్ లోనే ఆమె అందరికీ నచ్చేసింది . క్రాక్ – నాంది -వీరసింహారెడ్డి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో కీలకపాత్రలో కనిపించి మెప్పించింది వరలక్ష్మి శరత్ కుమార్ . తాజాగా అమ్ముడు పెళ్లి చేసుకోబోతుంది . మార్చి 2 నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్ ఫ్రెండ్ నికోలై సచ్ దేవ్ ను జూలైలో పెళ్లి చేసుకోబోతుంది . ఇప్పటికే వెడ్డింగ్ కార్డ్స్ కూడా అందరికీ పంచేసింది . చాలా సింపుల్గా సాంప్రదాయ బద్దంగా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతుంది. ఆల్రెడీ నికోలై సచ్ దేవ్ కు పెళ్లయింది . ఒక బిడ్డ కూడా ఉంది .

అయినా సరే అతడు క్యారెక్టర్ నచ్చి ప్రేమించింది వరలక్ష్మి శరత్ కుమార్ . కాగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమించిన నికోలై సచ్ దేవ్ ఆస్తి విలువ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నికోలై సచ్ దేవ్ తరతరాల ఆస్తి బాగానే వచ్చిందట. అయితే దానిపై ఆయనకు ఏమాత్రం మోజు లేదట. ఆయన తన సొంతం కష్టం మీదనే నిలబడాలి అనే టైప్ . ముంబైలో సొంత ఆర్ట్ గ్యాలరీ ఉంది. అంతేకాదు పర్సనల్ గా పలువురు స్టార్ సెలబ్రిటీస్ కి ఫోటోగ్రాఫర్ నెలకు సంపాదన లక్షల్లోనే వస్తూ ఉంటుంది. పీక్ టైమ్స్ లో అది కోట్లు కూడా దాటేస్తూ ఉంటుందట . మంచి టాలెంట్ ఉన్న నికోలై సచ్ దేవ్ క్యారెక్టర్ నచ్చి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకుందట . వరలక్ష్మి శరత్ కుమార్ కంటే నికోలై సచ్దేవ్ చాలా చాలా ఆస్తి ఎక్కువ కలిగిన వ్యక్తి అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!