ప్రభాస్ టైం ఎంత బ్యాడ్ గా ఉంది అంటే.. కల్కి సినిమా హిట్ అయిన ఈ తలనొప్పులు మాత్రం తప్పవా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు కల్కి సినిమాపై హ్యూజ్ బజ్ నెలకొన్న పాజిటివ్ రివ్యూస్ వినిపిస్తున్న కానీ ప్రభాస్ పై అక్కడక్కడ నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది . అయితే సినిమాకి సంబంధించిన పాజిటివ్ టాక్ ఎంత హైలైట్ అవుతుందో ఆయన వ్యక్తిగతంగా సంబంధించిన నెగిటివ్ టాక్ అంతే హైలెట్ గా మారిపోతూ ఉండడం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి .

మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాపై ఎలాంటి హై ఎక్స్ పెక్టేషన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ లో నెలకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మొదటి రోజే ఈ సినిమా 100 కోట్లు దాటేస్తుంది అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి . అయితే సినిమా ఎంత హిట్ అయినా సరే ప్రభాస్ కి పట్టుమంటే ఆ ఆనందం పది రోజులు కూడా ఉండేలా లేదు అంటూ మరొక న్యూస్ ట్రెండ్ అవుతుంది .

ప్రభాస్ కల్కి సినిమా హిట్ కొడితే చూసి ఆనందించే ఫ్యాన్స్ కన్నా ఆయన పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యే ఫ్యాన్స్ నే ఎక్కువ. ఆల్రెడీ ప్రభాస్ పెద్దమ్మ ఈ ఇయర్లో ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ బయట పెట్టేసింది. ఇక ఆరు నెలలే మిగిలింది.. ఈ ఆరు నెలల్లో కూడా ప్రభాస్ తన ప్రేమ విషయం బయటపెట్టాలి.. లేదంటే కుటుంబ సభ్యులు చెప్పిన అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అయినా బయటపెట్టాలి.. లేదంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకోరు .. రచ్చ రంబోలా చేసేస్తారు . దీంతో ప్రభాస్ సినిమా హిట్ అయినా సరే ఆ ఆనందం ఆయనకు ఎక్కువ కాలం ఉండదు అని .. ఫ్లాప్ అయిన ఆయనకు తలనొప్పులు ఈ విధంగా వెంటాడుతాయి అని ప్రచారం చేస్తున్నారు జనాలు..!!