బిగ్ బ్రేకింగ్: “కల్కి” సినిమా ఆపేయ్యండి..? ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం..ఏమైందంటే..?

“కల్కి” సినిమాపై ఎలాంటి బజ్ నెలకొందో అందరికీ తెలిసిందే . కేవలం మరికొద్ది గంటల్లో ప్రభాస్ నటించిన సినిమా కల్కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అని తెలిసి ఫ్యాన్స్ రచ్చ రంబోలా చేస్తున్నారు . భారీ భారీ కటౌట్లు ..ఫ్లెక్సీలతో.. పూలదండలతో .. పాలాభిషేకాలతో కల్కి సినిమా రిలీజ్ అయ్యే థియేటర్స్ వద్ద సందడి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు . అయితే ప్రభాస్ కల్కి సంబంధించి కొందరు నెగిటివ్ గా కూడా ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం. మరీ ముఖ్యంగా ప్రభాస్ అంటే పడని కొందరు జనాలు సినిమాకి నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారు . కరెక్ట్ గా ఇదే మూమెంట్లోనే ఏపీ ప్రభుత్వం కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఆంధ్ర గవర్నమెంటు కల్కి సినిమా టికెట్ల ధర పెంచుతూ అదనపు షోలకి సైతం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . ఈ నెల 27 నుంచి రెండు వారాలపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఏపీ ప్రభుత్వం .ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కల్కి సినిమా చిత్ర టిక్కెట్ సింగిల్ స్క్రీన్ పై 75 రూపాయలు మల్టీప్లెక్స్ లో 125 రూపాయల వరకు పెంచుకోవచ్చు అని పేర్కొంది . అంతే కాదు ఒక రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీళ్లుగా జీవో జారీ చేసింది . అయితే ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇప్పుడు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

High Court
కొందరు జనాలు టికెట్ రేట్లు మరీ ఎక్కువైపోయాయి అని ఏపీ ప్రభుత్వం ఇలా వాళ్లకు సపోర్ట్ చేయడం సమంజసం కాదు అని ఎక్కడైతే కల్కి సినిమా టిక్కెట్ రేట్లు ఎక్కువగా చేసి అమ్ముతున్నారో.. అలాంటి థియేటర్స్ లో కల్కి సినిమాను ఆపేయాలి అని డిమాండ్ చేస్తున్నారు . కానీ ఫ్యాన్స్ మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా సినిమా రిలీజ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కల్కి సినిమాకి సంబంధించిన వార్తలు మరింత స్థాయిలో ట్రెండ్ అవ్వడమే కాకుండా హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయి . చూద్దాం మరి కల్కి సినిమాపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో..? నెగిటివ్ టాక్ క్రియేట్ చేసే వాళ్ళకి ఎలా బుద్ధి చెబుతుందో ..? ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూద్దామా అంటూ థియేటర్స్ బయట పడి గాపులు కాస్తున్నారు..!!