కల్కి సినిమాలో రష్మిక మందన్నా మిస్ చేసుకున్న పాత్ర ఏంటో తెలుసా..? బ్రతికిపోయింది..!

కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికే బాగుంటాయి . మరి కొంతమందికి సూట్ అవ్వవు .. కొంతమంది డైరెక్టర్స్ ముందుగా క్యారెక్టర్ కోసం ఒక హీరోయిన్ అనుకుంటారు.. కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసి మరొక హీరోయిన్ ని పెట్టుకుంటూ ఉంటారు .. మరి కొందరు ఏకంగా రోల్స్ ని మిస్ చేసేసుకుంటూ ఉంటారు. తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ పలు ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది .

ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన్నాకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో లేటెస్ట్గా నటించిన కల్కి సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని మిస్ చేసుకుంది రష్మిక మందన్నా అంటూ ప్రచారం జరుగుతుంది . ఆ క్యారెక్టర్ మరేదో కాదు దిశా పటానిది. నిజానికి ఈ సినిమాలో దిశాపటాని రోల్ చాలా చాలా తక్కువ.. అసలు ఎందుకు ఉందో ఎందుకు వెళ్లిపోయిందో కూడా తెలియదు.

అలాంటి ఒక అరుదైన రేర్ క్యారెక్టర్ . అయితే ఆ పాత్ర కోసం ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను అనుకున్న.. కొన్ని కారణాల చేత రష్మిక ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ఈ రోల్ కోసం దిశాను చూస్ చేసుకున్నారట . బాలీవుడ్ స్థాయిలో ట్రెండ్ అవుతుంది అన్న కారణంతోనే దిశాన్ని ఈ పాత్రకు చూస్తూ చేసుకున్నారట . తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ ఈ పాత్రను రిజెక్ట్ చేసి రష్మిక మంచి పనే చేసింది .. ఈ సినిమా తర్వాత దిశాను ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో చూసాం .. మొత్తానికి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది రష్మిక మందన్నా..!