కల్కి సినిమాకి ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? చెత్తగా ఉంది అంటూ మార్చింది ఎవరంటే..?

కల్కి ..కల్కి .. కల్కి ఒకప్పుడు యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించిన కల్కి సినిమా ఏ రేంజ్ లో ఇండస్ట్రీని ఊపేసిందో అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు దానికి మించిన రేంజ్ లో ఈ కల్కి సినిమా మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న నాగ్ అశ్వీన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమానే ఈ కల్కి . అశ్విని దత్ దాదాపు 600 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు.

మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక్కొక్క న్యూస్ ని బాగా హైలైట్ చేస్తున్నారు రెబెల్ అభిమానులు. కాగా సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కల్కి అనే డిఫరెంట్ నేమ్ పెట్టడంతోనే నాగ్ అశ్వీన్ సగం హిట్టు కొట్టాడు అంటూ పొగిడేస్తున్నారు జనాలు . అయితే కల్కి సినిమాకి ముందు అనుకున్న టైటిల్ యుగపురుషుడు అంటూ తెలుస్తుంది .

కానీ యుగపురుషుడు అంటే పాటగా ఉన్నట్లు ఉందట. అంత నాటిగా క్యాచీగా లేదు అని నేటి జనరేషన్ కి తగిన విధంగా టైటిల్ ఉండాలి అంటూ కల్కి అనే పేరుని చూస్ చేసుకున్నారట నాగ్ అశ్వీన్ . యుగపురుషుడు అనే టైటిల్ ని పెట్టింది కూడా నాగ్ అశ్వీన్ నే . ఆ తర్వాత ఆయన పెట్టిన టైటిల్ ఆయనకే నచ్చక ఓటింగ్ తో కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ సలహా మేరకు కల్కి సినిమా పేరుని చూస్ చేసుకున్నారట . ప్రభాస్ కి కూడా ఈ కల్కి అనే టైటిల్ బాగా నచ్చేసింది..!!