ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ను క్షమాపణలు కోరిన అమితాబచ్చన్.. ఏం జరిగిందంటే..?!

పాన్ ఇండియన్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పిన్న సంగతి తెలిసిందే. జూన్ 27న మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ్‌ అశ్విని దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ తరుణంలో కల్కి సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ప్రభాస్, అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే నిర్మాతల ప్రియాంక దత్, స్వప్న దత్ కలిసి సినిమా విషయాలను మాట్లాడుకున్నారు. వీరు ముచ్చ‌టించిన ఈ వీడియోని వైజయంతి మూవీస్ తాజాగా రిలీజ్ చేసింది.

Kalki 2898 AD: Ahead of Film's Release, Amitabh Bachchan Seeks Apology from  Prabhas Fans - Know Why

అమితాబచ్చన్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో నేను చాలా పెద్ద పర్సనాలిటీతో కనిపిస్తానని వివరించాడు. నాగ్ అశ్విన్ నా దగ్గరకు వచ్చి ప్రాజెక్టు గురించి చెప్పారని.. ఈ మూవీలో నేను, ప్రభాస్ ఎలా కనిపిస్తున్నామో.. కొన్ని ఫోటోల ద్వారా రిఫరెన్స్ చూపించాడని.. ది ప్రభాస్ ని కొట్టే భారీ పర్సనాలిటీ నేను అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై మాట్లాడుతూ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నన్ను క్షమించాలి. నేను చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నా.. సినిమాలో నేనేం చేశాను చూసి నాపై అసలు దాడికి దిగవద్దు అంటూ వివరించాడు.

Amitabh Bachchan, Kamal Haasan and Prabhas Pose with Pregnant Deepika  Padukone for 'Kalki 2898 AD' Film | - Times of India

దీనిపై ఫన్నీగా రియాక్ట్ అయిన ప్రభాస్.. అందరూ మీ అభిమానులే అంటూ చెప్పుకొచ్చాడు. అమితాబ్ మాటలకు అంత సరదాగా నవ్వుకున్నారు. ఈ సినిమాలో అశ్వద్ధామ పాత్ర పోషించిన అమితాబ్.. సౌత్ ఇండస్ట్రీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక్కడ ఇండస్ట్రీలో క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. కల్కి 2898 ఏడి సినిమా సెట్స్ ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా ఉందని వివరించాడు. కమల్ హాసన్ కూడా ఇదే అభిప్రాయాని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అమితాబ్‌, కమల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.