తమిళ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలను నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ అట్లీ. తాను తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తూ వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్నాడు. ఈయన చేసిన రాజరాణి, తేరి, బిగిల్, జవాన్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌లుగా నిలిచి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజులు క్రితం అట్లీ, అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.
ఇక దానికి తగ్గట్టుగానే సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నెటింట తెగ వైరల్ చేశారు. అయితే అట్లీ మాత్రం బన్నీతో ఎలాంటి సినిమా చేయడం లేదంటూ అనౌన్స్ చేశాడు. సినిమాకు సంబంధించి అన్ని ఫిక్స్ అయినా కూడా.. సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలని ఉద్దేశంతోనే అల్లు అర్జున్‌తో సినిమాను క్యాన్సిల్ చేశాడంటూ అట్లీపై విపరీతమైన కోపంతో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ క్రమంలో అట్లీని ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. అయితే బన్నీకి కూడా మరో పక్కన బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగాను, పర్సనల్ విషయాలు పరంగాను బన్నీకి తీవ్రమైన నిరాశ ఎదురవుతుంది.
ఈ క్రమంలో బన్నీ పర్సనల్ లైఫ్ లో వివాదాలు త్వరగా సద్దుమణిగితే మంచిదని అంత భావిస్తున్నారు. లేకపోతే చాలా వరకు సినిమాల పరంగాను ఆయనకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలో బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. అలాగే ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పుష్ప 2 తో భారీ సక్సెస్ అందుకఉంటే ఒకే. లేదంటే ఆయన మరోసారి కెరీర్ పరంగా భారీ డౌన్ ఫాల్ లో ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో బన్నీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో.