ఎవరు ఊహించని హీరోతో కమిట్ అవుతున్న శ్రీ లీల.. కలలో కూడా ఎక్స్పెక్ట్ చెయ్యని కాంబో ఇది..!

శ్రీ లీల ..ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవ్వరు ఊహించలేరు. శ్రీ లీల చాలా చాలా చిన్న అమ్మాయి. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోయిన్స్ లో చాలా చాలా చిన్న ..అయితే శ్రీలీల తీసుకుని నిర్ణయాలు మాత్రం చాలా చాలా బోల్డ్ గా ఉంటాయి . చాలా మెచ్యూరిటీగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది . అందుకే శ్రీలీల పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతూ ఉంటుంది.

కాగా రీసెంట్గా శ్రీ లీల – రవితేజ – నితిన్ సినిమాలలో నటించడానికి సైన్ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరితోనూ సెకండ్ టైం నటించబోతుంది శ్రీ లీల . అయితే కోలీవుడ్ లో ఏకంగా మూడు బడా సినిమాలలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. రీసెంట్గా శ్రీలీలా ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . శ్రీ లీల కోలీవుడ్ కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతుందట .

ఆల్రెడీ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తుంది . ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో శ్రీలీల కనిపించబోతుందట. ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండడంతో నచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకుందట . కమెడియన్ సరసన శ్రీ లీల నటించబోతుందా అంటూ ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . శ్రీ లీలతో సంతానం.. అసలు ఈ కాంబో ని ఊహించలేకపోయాం అంటున్నారు. చూద్దాం దీనిపై శ్రీ లీల ఎలా స్పందిస్తుందో..?