“కల్కి” సినిమాలో నటించమంటే నాగార్జున అలా అన్నాడా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!

నాగార్జున..టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో.. సీనియర్ హీరో ఎలాంటి పాత్రలను అయినా సరే అవలీలగా నటించగలరు నాగార్జున . కేవలం హీరోగానే నటించాడా అంటే నో అని చెప్పాలి . పలు సినిమాలలో గెస్ట్ పాత్రలో కూడా కనిపించాడు . మల్టీస్టారర్ సినిమాలలో కూడా మెరిశాడు నాగార్జున . ఎప్పుడు కూడా తన స్టేటస్ ని కాలిక్యులేట్ చేయడు ..కధ నచ్చితే ఆ సినిమాలో నటించేస్తాడు .. ఇప్పుడు కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు.

అయితే రీసెంట్గా నాగార్జునకు సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. నిజానికి కల్కి సినిమాలో అమితాబచ్చన్ నటించిన పాత్రలో నాగార్జున నే ముందుగా అనుకున్నారట డైరెక్టర్ నాగ్ అశ్వీన్. ఆయన నాగార్జునని అప్రోచ్ కూడా అయ్యారట . కానీ ఆయన క్యారెక్టర్ పట్ల సాటిస్ఫై అవ్వని నాగార్జున ఆరు రోల్ ని సున్నితంగా రిజెక్ట్ చేశారట . ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు కల్కి సినిమాలో నాచురల్ స్టార్ నాని ..దుల్కర్ సల్మాన్ ..రౌడీ హీరో ..విజయ్ దేవరకొండ కూడా గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . సోషల్ మీడియాలో ఇప్పుడు నాగార్జున పేరు మారుమ్రోగిపోతుంది . నాగార్జున తన వందవ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. ఈ సినిమా లో త్రిష-నయనతారలను హీరోయిన్లుగా పెట్టుకోబోతున్నారట..!!