“దానికోసమే వెయిట్ చేస్తున్న చిరంజీవి”.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!

మెగాస్టార్ చిరంజీవి ..చాలా చాలా టాలెంటెడ్.. చాలా చాలా మెచ్యూర్.. చాలా చాలా సైలెంట్ పర్సన్ .. ఒకటి కాదు రెండు కాదు ఆయన గురించి ఎన్నిసార్లు.. ఎన్ని విధాలుగా చెప్పుకున్న అది తక్కువే . కాగా మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమాపై కానీ ఏ వెబ్ సిరీస్ పై కాని రివ్యూ ఇచ్చారు అంటే మాత్రం అది కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయింది అని అర్థం . తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు నాగబాబు నటించిన పరువు వెబ్ సిరీస్ గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు .

పరువు వెబ్ సిరీస్ కి సంబంధించిన రివ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది . “ఘన విజయం సాధించిన పరుగు టీం కి వెరీ వెరీ స్పెషల్ విషెస్ అభినందనలు.. కొణిదల సుస్మిత మీ పట్ల గర్వంగా ఉన్నారు. అలాగే ఈ సంచలనాత్మక తెలుగు ఓటీటీ కంటెంట్ లో నా ప్రియమైన నాగబాబు అద్భుతంగా నటించాడు ..ఒక చక్కటి ప్లాన్ తో చందు బాడీ మాయం చేసి.. ఆ జంటపడే తిప్పలు చాలా చాలా ఆహ్లాదకరంగా అదే విధంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది”..

“నెక్స్ట్ ఏం జరగబోతుంది..? అన్న సస్పెన్స్ బాగా క్రియేట్ చేశారు . సీజన్ 2 కోసం నేను చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ రాసుకోచ్చాడు “. అంతేకాకుండా లింకు కూడా షేర్ చేశారు . ప్రెసెంట్ చిరు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి అటు కూతురిని..ఇటు తమ్ముడిని బాగానే ప్రమోట్ చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు అభిమానులు..!!