ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు రాజమౌళి ఫేవరెట్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఇప్పుడు స్టార్ సెలబ్రిటీ. దర్శక ధీరుడు రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ అభిమానాన్ని సొంతం చేసుకున్న క్రేజీ హీరో.ఈ కుర్రాడు.. తొమ్మిదేళ్ల క్రితం ముంబైలో సిటీ బ్యాంకులోని మంచి ఉద్యోగాన్ని వదులుకొని నటనపై ఆసక్తితో ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టాడు. కొత్త ఆలోచనలతో ఏదైనా చేయాలని అతని లక్ష్యంగా పెట్టుకొని సినీ పరిశ్రమల ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుని దూసుకుపోతున్నాడు. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం ప్రారంభించి.. మెల్లగా సిరీస్ చేయడం మొదలుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నాడు.

Watch the Blockbuster 'Premalu' on OTT This April - Pakka Telugu

అతడు నటించిన ఓ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బ‌స్టర్ అందుకుంది. ఈ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. తన సహజ న‌ట‌న‌తో డైరెక్టర్ రాజమౌళినే ఫిదా చేసిన ఈ నటుడు ఎవరు గుర్తుపట్టడం కాస్త కష్టమే. ఇంతకీ అతను ఎవరో అనుకుంటున్నారా.. కేరళ అబ్బాయి.. మలయాళ ఇండస్ట్రీ క్రేజీ హీరో శ్యామ్ మోహన్. ఈ పేరు చెబితే వెంటనే గుర్తుకు రావడం కష్టమే. అయితే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రేమలు మూవీ యాక్టర్ అనగానే టక్కున గుర్తుకొస్తాడు. శ్యామ్ మోహన్ తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఒక్కే ఒక్క‌ సూపర్ హిట్ (ప్రేమలు) సినిమాతో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు.

Premalu star Shyam Mohan says THIS gesture was his improvisation for his  character Aadhi in the rom-com drama | Exclusive

ఈ సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. శ్యామ్ మొదట యూట్యూబ్ వెబ్ సిరీస్ పొన్ను ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాడు. ఇలా పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ నైట్ కాల్ అనే షార్ట్ ఫిలిం తో మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. 18 ప్లస్ మూవీతో వెండితెరకు పరిచయమైన శ్యామ్.. ఫస్ట్ మూవీ తర్వాత మలయాళం లో అనేక సినిమాల్లో నటించాడు. ఇటీవల నటించిన ప్రేమలుతో ఆది పాత్రలో మెప్పించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా.. తెలుగులో రిలీజ్ కాగా.. సూపర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.

Rajamouli reveals Aadi as his favourite character in 'Premalu' at Telugu  version's success meet | Onmanorama

ఈ సినిమాతో శ్యామ్‌మోహన్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్, శ్యామ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అద్యాంతం నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమాలో ఆది పాత్రలో నటించిన తన ఫేవరెట్ నటుడు అంటూ నటన, అల్లరి, రైటింగ్ తనకు చాలా బాగా నచ్చాయి అంటూ డైరెక్టర్ రాజమౌళి గతంలో ప్రేమ‌లు మూవీ సక్సెస్ మీట్ లో వివరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్యామ్ మోహన్, శివ కార్తికేయ, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తమిళ్ మూవీ లో సాయి పల్లవి తమ్ముడుగా నటిస్తున్నాడు. అలాగే గోవింద్ గెట్ సెట్ బేబీ సినిమాల్లోనూ కనిపించనున్నాడు.