నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ కంటే ముందే ఎంట్రీ ఇస్తున్న అ యంగ్ హీరో.. అనౌన్స్మెంట్ టైం ఫిక్స్..?!

విశ్వవిఖ్యాత నందమూరి నటసార్వభౌమ తారక రామారావు గారి ముని మనవడు.. హరికృష్ణ మనవడు.. సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అతని పేరు కూడా నందమూరి తారక రామారావు. మ్యాన్ ఆఫ్ మాసేస్ జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు దివంగత జానకిరామ్ కుమారుడే ఈ ఎన్‌టీఆర్‌. సీనియర్ ఎన్టీఆర్ ముని మనవడిగా.. ఆయన పేరుతోనే అతడు ఇండస్ట్రీలోకి రానున్నాడు. ఈ తరం నందమూరి తారక రామారావు నటించిన తొలి సినిమాకి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించనున్నాడు.

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న హరికృష్ణ మనవడు.. ఆనందంలో నందమూరి ఫ్యాన్స్ - Telugu  News | Nandamuri Janakiram sons Taraka Rama Rao will make his debut as a  hero | TV9 Telugu

ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ డేట్, టైం కూడా ఫిక్స్ అయ్యాయి. సెన్సేషనల్ అనౌన్స్మెంట్ వస్తుందంటూ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తాజాగా ఓ పోస్ట్ ను రిలీజ్ చేశాడు. ఈరోజు ఉదయం దానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి అంటూ తాజాగా ఆయ‌న ఓ పోస్ట్ షేర్ చేశౄడు. అయితే హీరో ఎవరో అనేది వైవిఎస్ చౌదరి వెల్లడించకపోయిన.. నందమూరి జానకిరామ్ కుమారుడు తారకరామారావును హీరోగా పరిచయం చేసే మూవీ గురించి అంటూ బయటకు వార్తలు వినిపించాయి. ఇక తారక రామారావు ఇటీవల పెద్దగా బయట కనిపించలేదు. దీంతో ప్రస్తుతం అతను ఎలా ఉన్నాడో కూడా చూడాలని చాలామంది ఆశ పడుతున్నారు.

దీంతో ఎప్పుడెప్పుడు తారక రామారావు కెమెరా ముందుకు వస్తాడ.. ఆయన ఎలా ఉన్నాడో చూద్దామని ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక వైవిఎస్ చౌదరి ఇప్పటికే సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, ఒక్కమగాడు సహా ఎన్నో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరిగా సాయి ధరంతేజ్ తో 2015లో రేయ్ మూవీ తెరకెక్కించాడు. ఇప్పుడు మళ్లీ తొమ్మిది ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టిన డైరెక్టర్ వైవీయ‌స్‌.. హ‌రికృష్ణ.. మనవడు తారకరామారావును వెండి తెరకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.