బన్నీ తో బాక్సాఫీస్ పోరుకు సై అంటున్న బాలీవుడ్ హీరో.. పెద్ద సాహసమే చేస్తున్నాడే..?!

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ఐకాన్‌ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప.. పుష్ప రాజ్.. త‌గ్గేదేలే అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బన్నీ.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఆగస్ట్ 15న ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ రీత్యా పుష్ప 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లింప్స్‌, టీజర్, రెండు పాటలు ప్రేక్షకులను వేరే లెవెల్ లో ఆకట్టుకున్నాయి.

As Pushpa 2: The Rule teaser is all set to drop tomorrow, the makers teases  the fans with the image from the studio, saying"The nation will go on a  high adrenaline rush" |

ఇక ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో సినిమాను ఎక్కడ ఆపేది లేదంటూ పుష్పరాజ్ హవా కొనసాగుతుంది. ఈ క్రమంలో అటు బాలీవుడ్ లోను.. ఇటు సౌత్ లోనూ హీరోలెవరు బరిలోకి దిగేందుకు సిద్ధం కావడం లేదు. మొదట్లో ఆగస్టు 15 రోహిత్ శెట్టి.. సింగం ఎగైన్ సినిమాను రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే పుష్ప 2 కంటే రోహిత్ శెట్టి ముందే తన సింగం ఎగైన్ రిలీజ్ డేట్ లో ప్రకటించాడు. మొదట ఆగస్టు 15 అనుకున్న రోహిత్ శర్మ.. పుష్ప2 అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే వెనక్కు తగ్గాడు. కోలీవుడ్, బాలీవుడ్ లోనూ పుష్పతో పోటీపడేందుకు ఎవరు సిద్ధంగా లేరు. ఇక పుష్ప రాజ్‌కి పోటీ లేదు అనుకున్న టైంలో బాక్సాఫీస్ వార్‌కి నేను సై అంటూ బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం రంగంలోకి దిగాడు.

John Abraham, Sharvari Wagh Drop Intense First Look Poster Of Vedaa;  Release Date Revealed | Hindi News, Times Now

ఆయన హీరోగా నటించిన వేద సినిమాను ఆగస్ట్ 15 నా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నిర్మాతలు అధికారక ప్రకటన కూడా చేశారు. దీంతో బాలీవుడ్ మీడియాలో పుష్ప వర్సెస్ వేదా అంటూ వార్త‌లు తెగ వైరల్ గా మారాయి. అయితే బాలీవుడ్ లో పుష్ప సినిమాకు క్రేజ్‌ వేరే లెవెల్లో ఉంది.. అన్ని ఇండస్ట్రీలో కంటే అక్కడే ఎక్కువ మార్కెట్ జరుగుతుందని అంచనాలు ఉన్నాయి. అయినా కూడా జాన్ అబ్రహం పోటీపడేందుకు సిద్ధమయ్యాడు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోతో పోటీపడే రేంజ్ అయనది కాదు అంటూ.. బన్నీతో పోటీ అంత ఈజీ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బాక్స్ ఆఫీస్ బ‌రిలో బాలీవుడ్ దగ్గర ఎవరు సత్తా చాటుతారో చూడాలి.