తెలుగు స్టటార్ యాక్ట్రెస్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో తెలుగుతో పాటు పలు భాషల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. కాంట్రవర్సీలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల పూనమ్ చేస్తున్న ట్వీట్స్ నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఈ అమ్మడు బైనాట్ 175 అనే విషయాని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు ఉన్నారు అంటూ ఫన్నీ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే.
దీనికి హ్యాష్‌ట్యాగ్ ఆంధ్రప్రదేశ్ అనే ట్యాగ్‌ను కూడా జోడించి పోస్టులు షేర్ చేసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారడంతో అసలు పూనమ్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసింది అనేది నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత అధికారంలోకి రాబోతున్న టీడీపీ, జనసేన కూటమి గురించి షేర్ చేసింది. సుగాలి ప్రీతి కేసును త్వరగా పరిష్కరించాలంటూ ఆమె విన్నపించింది. తాజాగా మరో ఆసక్తికర ట్విట్‌తో పూనమ్ మరోసారి వైరల్ గా మారింది. ఈసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆమె జగన్ తన ఫ్యామిలీతో కలిసిపోతే మరింత బలోపేతంగా ఉంటుందంటూ రాసుకొచ్చింది. గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిళా కీలక పాత్రలు పోషించారని.. వారు తమదైన మార్గాల్లో.. సహనం, పట్టుదలను నేర్పారని వివరించింది. ఇప్పుడు వారంతా కలిసి ఉంటే బాగుంటుందని.. ఆమె ట్విట్ చేసింది. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ కమెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు స్పందిస్తు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వై.ఎస్.జగన్ తన ఫ్యామిలీతో కలిసి పోయి మరింత బలంగా ప్రజల్లోకి రావాలని కోరుతూ అభిమానులు తమ అభిప్రాయాని వ్యక్తం చేస్తున్నారు.
The architects of #ysjaganmohanreddy garu’s previous success were the three important women of his life , his mother , his sister , his wife YS Bharathi garu who truly teaches patience and perseverance in her own ways , I wish the entire family togetherness , love and peace ✌️ 🙏
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 7, 2024