జాలి, దయా, కరుణా లేని అసురుడు ఆగమనం.. NBK 109 టీజర్ వచ్చేసిందోచ్(వీడియో)..

టాలీవుడ్ మాస్ హీరో నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా చేసిన గత మూడు సినిమాలు వరుసగా హ్యాట్రిక్ హిట్లు అందుకున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలు అందరిలో టాప్ పొజిష‌న్‌లో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి తో తన 109వ సినిమాను న‌టిస్తున్నాడు. ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే ప్రేక్షకుల్లో భారీ బజ్‌ ఏర్పడింది. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఓఎప్పుడెప్పుడు సినిమాపై కొత్త అప్డేట్ వినిపిస్తుందా అంటూ అభిమానులంతా ఆశ‌క్తిగా ఎదురుచూశారు.

తాజాగా బాలయ్య బర్త్డే సెలబ్రేషన్స్‌ను పురస్కరించుకుంటూ మేకర్స్ సినిమాకు సంబంధించిన క్రేజీ ట్రీట్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశారు. ముందుగానే బాలయ్య పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటూ ఫ్యాన్స్ ట్రీట్ ఇస్తామంటూ చెప్పిన మేక‌ర్స్ అన విధంగానే ఆల్ టైం అప్డేట్ను అందించేసారు. తాజాగా NBK 109 టీజర్ రిలీజ్చేసి సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్‌ పెంచేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకుంది. ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్‌తో అదరగొట్టారు. టీజర్ లో బాలయ్య ఇంట్ర‌డ‌క్ష‌న్ కోసం మకరందేస్ పాండే చెప్పిన‌ డైలాగ్, ఎలివేష‌న్‌ ఫ్యాన్స్నుఏ ఆక‌ట్టుకున్నాయి.

జాలీ, దయ, కరుణ‌లేని ఒక అసురుడు అంటూ బాలయ్య పై చెప్పిన ఎలివేషన్ డైలాగ్ మెప్పించింది. ఇక లాస్ట్ లో గుర్రంతో బాలయ్య సీక్వెన్స్ అద‌ర‌గొట్టారు. సినిమాకు థ‌మన్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రైండ్‌ స్కోర్ కూడా బాగుంది. మొత్తానికి బాలయ్య అభిమానులకు మాత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ మంచి ట్రీట్ ఇచ్చింది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ టీజర్ నెటింట తెగ ట్రెండ్ అవుతుంది. మీరు ఓ లుక్ వేసేయండి.