ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనున్న ఆశిక రంగనాథ్.. మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా..?!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్‌ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కన్నడ సోయగం ఆశికా రంగనాథ్. అందం, అభినయంతో ఎలాంటి పాత్రనైనా పోషించే సత్తా ఉన్నప్పటికీ ఈ అమ్మ‌డు కెరీర్ మొద‌ట్లో ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి బ‌చ్చింది. అయినా ఊహించిన రెంజ్‌లో అవకాశాలు అందుకోలేక పోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మ కెరీర్‌లో ముంద‌డుగు వేస్తుంది. కానీ క్రేజ్ మాత్రం ఊహించిన రేంజ్ లో రావడం లేదు.

Exclusive: Dream come true for Ashika Ranganath; to act with Siddharth, her  teen idol | Kannada Movie News - Times of India

అమిగోస్‌ సినిమా తర్వాత చాలా గ్యాప్‌తో ఈ అమ్మ‌డు నాగార్జున నటించిన నా సామి రంగ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. కాగా ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో రిలీజై మంచి సక్సెస్ అందుకోవ‌డంతో ఆశికకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఏకంగా చిరంజీవి స‌ర‌సన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం విశ్వంభరాలో ఆశికా కూడా సెకండ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పుడిప్పుడే లైన్లోకి వస్తున్న ఈ అమ్మడు.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Siddharth, Ashika Ranganath's 'Miss You' 1st look poster out - India Today

టాలీవుడ్ క్రేజీ హీరో సిద్ధార్థ స‌ర‌స‌న‌ నటించే ఛాన్స్‌ దక్కించుకుందట ఈ ముద్దుగుమ్మ. ఇక సిద్ధార్థ్ నటిస్తున్న ఈ సినిమాకు మిస్ యు అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే ఆశిక కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్ అయినా చాలు అనుకుంటే ఇప్పటికే ఎన్నో అవకాశాలు క్యూ కట్టేవి. కానీ ఆమె గ్లామర్ తో పాటు తన రోల్ కు ఇంపార్టెన్స్ ఉండే పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. దీంతో ఆషిక కెరీర్ ప‌రంగ కాస్త నెమ్మదిగా ఉన్నా.. ఫూచ‌ర్‌లో ఈ అమ్మ‌డు ఇలానే కంటెంట్ ఉన్న సినిమాలు మాత్ర‌మే న‌ట‌టిస్తే మంచి గుర్తింపుతో పాటు టాలీవుడ్‌లో మ‌రిన్ని అవ‌కాశాలు అందుకోవ‌డం ఖాయం అంటూ అభిమానులు త‌మ అభిప్రాయాని వ్య‌క్తం చేస్తున్నారు.