సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ షోకు మాత్రమే పరిమితమయ్యేవారు.. వెబ్ సిరీస్ పుణ్యమా అని నటన పద్ధతులను మార్చుకుని హీరోయిన్స్ మరింతగా తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో కొందరు హీరోయిన్లు మొన్నటి వరకు గ్లామర్ షో తో ఆకట్టుకున్నా.. తర్వాత క్రైమ్ స్టోరీస్ లో పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సన్నీలియోన్, ప్రియమణి జాకీ షాప్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ కొటేషన్ గ్యాంగ్ నెటింట అరాచకం సృష్టిస్తుంది.
వివేక్ కుమార్ కన్నన్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను ఫిల్మీ నాట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గాయత్రి సురేష్ ప్రతిష్టాత్మకంగా నిర్హంచారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో వీరి నటనను చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. సాధారణంగా సన్నీలియోన్ ను చూస్తే కుర్రాళ్ళు టెంప్ట్ అవుతూ ఉంటారు. ప్రతి సినిమాలో హట్ అందాలతో మాత్రమే కుర్రాళను కవించే సన్నీ రోల్ ఈ సినిమాలో జెట్ స్పీడ్‌లో మర్డర్ చేసే వ్యక్తిగా.. భయంకరంగా డిజైన్ చేశారు. ఊర మాస్ వైలెన్స్ తో ఉన్న ఈమె పాత్ర ప్రేక్షకుల్లో వణుకు పుట్టిస్తుంది.
అయితే సినిమా రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు మేకర్స్. జూలైలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మాత్రమే ప్రకటించారు. అలాగే రిలీజ్ టైం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు మూవీ టీం. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నిలియోన్ తాజాగా తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ కొటేషన్ గ్యాంగ్ మూవీలో చాలా యాక్షన్స్ సీన్స్ ఉంటాయని.. వాటిని చూశాక నాపై మీలో ఉన్న అభిప్రాయం మారిపోతుందని నమ్ముతున్న అంటూ సాంప్రదాయని.. సుప్పిని.. సుద్ధపూసిని లా ఉండనున్నట్లు వివరించింది. ప్రజెంట్ సన్నిలియోన్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.