ఎస్.. ప్రస్తుతం ఇదే న్యూస్ నెటింట తెగ వైరల్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక యంగ్ హీరో నిఖిల్ కూడా చిన్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్నాడు. హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కెరీర్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు హిట్‌లుగా నిలిచాయి. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన కార్తికేయ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. ఈ సినిమా సీక్వెల్ కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కార్తికేయ 2 మంచి సక్సెస్ సాధించడంతో వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు.
ఇక నిఖిల్ నుంచి చివరిగా వచ్చిన స్పై సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సుభాష్ చంద్రబోస్ కథంశంతో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. అయితే దీని తర్వాత నిఖిల్ మరింత కసితో ఎతరకెక్కిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ స్వయంభు. బిగ్గెస్ట్ పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాగూర్ మధు ప్రొడక్షన్‌లో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటాషా హీరోయిన్‌లుగా మెప్పించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక రాంచరణ్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఏంటి అనే ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఈ సినిమాకు అసలు ట్విస్ట్ ఇదే. చరణ్ ఈ సినిమాలో నటుడిగా కాదు.. ప్రొడ్యూసర్ గా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. నిఖిల్ తాజా పాన్ ఇండియన్ మూవీ.. ది ఇండియా హౌస్ సినిమాకు రాంచరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. శివుని ఆశీస్సులతో నేడు హంపి విరూపాక్ష దేవాలయంలో ఈ సినిమా పూజ కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్ లో జరగనున్నాయి. ఇక ఈ మూవీకి రామ్ వంశీకృష్ణ తెరకెక్కిస్తుండగా.. చరణ్‌తో పాటు హీరో అభిషేక అగర్వాల్ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ యాక్టర్ అనుపమ కేర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.