బిగ్ బ్రేకింగ్: మరోసారి పిఠాపురంకి వెళ్లబోతున్న రామ్ చరణ్ .. ఎందుకో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రామ్ చరణ్ మరోసారి పిఠాపురం కి రాబోతున్నాడు .. అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే.. దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికలు ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అంతా కంఠినంగా వెయిట్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఠాపురంలో ఎలాంటి హైట్ టెన్షన్ వాతావరణం నెలకొందో అందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం.. అయితే ఎన్ని ఓట్ల మెజారిటీతో ఆయన గెలవబోతున్నారు అనేది ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కాగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా వచ్చే ప్రచారం చేసిన విషయం తెలిసిందే … మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తుంది అన్న విషయం కూడా తెలుసు . అయితే అప్పుడు పిఠాపురం కి వచ్చిన రాంచరణ్ ఇప్పుడు మరోసారి పిఠాపురం కి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈసారి మామయ్య కోసం కాదు ఫ్రెండ్ కోసం రాబోతున్నారట. శర్వానంద్ తాజాగా నటించిన సినిమా “మనమే”. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా జూన్ 7వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 5వ తేదీ పిఠాపురంలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ రాబోతున్నారట . దీంతో మరోసారి పిఠాపురంలో రామ్ చరణ్ సందడి చేయబోతున్నారు అన్న వార్త వైరల్ గా మారింది..!!