పాపం .. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ టైం అసలు బాగోలేదని చెప్పాలి.. ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ రేంజ్ లో ఆయనకే బౌన్స్ బ్యాక్ అవుతుంది. మరి ముఖ్యంగా పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు తెలుగు చరిత్రను తిరగ రాయబోతున్నాడు అని ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అంతే ఈగర్ గా ఆయనను తొక్కేయడానికి జనాలు ట్రై చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పొలిటికల్ వార్ లో బాగా చిక్కుకునేసాడు బన్నీ.
వైసిపి క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడం చాలా చాలా ఆయనకు నెగిటివ్గా మారింది. అంతేకాదు కొంతమంది మెగా ఫాన్స్ పుష్ప2 సినిమాను ఫ్లాప్ చేస్తామంటూ స్ట్రైట్ గానే వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే బన్నీకి మరో పెద్ద హెడేక్ వచ్చి చేరింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో బన్నీ ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతుంది .
కొన్ని కారణాల చేత ఈ సినిమాని ఆపేసారట . త్రివిక్రమ్ శ్రీనివాసరావు శ్రీనివాసరావు – పవన్ కళ్యాణ్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం మనకు తెలుసు . ఈ సినిమా ఆగిపోవడం వల్ల పవన్ కళ్యాణ్ హస్తం ఉందా..? అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న బన్నీను ఇలా తొక్కేయడానికి స్టార్ హీరోలు కూడా చూస్తూ ఉండడం బన్నీ ఫాన్స్ కు మండిపోయేలా చేస్తుంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది. దీంతో మరొకసారి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది..!!