బిగ్ బ్రేకింగ్: మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు మృతి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సోషల్ మీడియాలో నిరంతరం ఎప్పుడు ట్రెండ్ అవుతూ ట్రోలింగ్కి గురవుతూనే ఉంటుంది . సినిమా ఇండస్ట్రీలోకి ఆమె రాకపోయినా సరే ఒక హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ అవుతుందో అంతకు పదిరెట్లు ఎక్కువగానే ట్రోల్ అవుతూ వస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో శ్రీ జ పేరును మరోసారి ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు .

శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ కొద్దిసేపటి క్రితమే మరణించారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . 2007వ సంవత్సరంలో శ్రీజ ఇంట్లో ఎవరికీ తెలియకుండా గుడిలో శిరీష్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకుంది . అప్పట్లో ఈ వివాహం సంచులనం సృష్టించింది . ఆ తర్వాత వీళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ తర్వాత 2014లో వీళ్ళు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు . వీళ్ళ మధ్య వచ్చిన మిస్ అండర్స్టాండింగ్సే దానికి కారణం .

ఆ తర్వాత 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్ ఘనంగా వివాహం చేసుకున్నారు. కాగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ చికిత్స తీసుకుంటూ హాస్పిటల్ లో మృతి చెందినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . దీంతో కొందరు శ్రీజను వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్ చేస్తుంటే మరికొందరు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ చనిపోవడానికి పరోక్షకంగా కారణం మెగా ఫ్యామిలీని అంటూ మండిపడుతున్నారు . ఆయన మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!!