బన్ని చేసిన పనికి కోపంగా ఉన్న రష్మిక.. భలే అడ్డంగా బుక్ అయిపోయిందే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారిపోయింది . పుష్ప 2 సినిమా వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ బడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2. ఈ సినిమా కోసం అభిమానులు ఎంత లా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం అటు అల్లు అర్జున్ ఇటు సుకుమార్ పడిన కష్టం ఫ్యాన్స్ కళ్ళల్లో నీళ్లు తెప్పించేసాయి . అయితే ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది . కొన్ని కారణాల చేత ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడడంతో రష్మిక మందన్నా సైతం డీప్గా హార్ట్ అయిందట .

అంతేకాదు కొత్త సమస్యల్లో ఇరుక్కున్నట్లు ప్రచారం జరుగుతుంది . రష్మిక మందన్నా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా సినిమాలో నటిస్తుంది . అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఓ రేంజ్ లో దున్నేస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆమె విక్కీ కౌశల్ తో కలిసి చావా అనే సినిమాలో నటిస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేయాలని మేకర్స్ ఎప్పటినుంచో ప్లాన్ చేశారట .

అటు తిరిగి ఇటు తిరిగి పుష్ప2 కూడా ఇప్పుడు డిసెంబర్ 6నే రిలీజ్ కాబోతుంది. దీంతో రష్మికకు పెద్ద తలనొప్పులే వచ్చి పడ్డాయి. ఒకపక్క పుష్ప2 మరొక పక్క చావా..ఏ సినిమాకి ప్రమోషన్స్ చేయాలి ఏ సినిమా హిట్ అవుతుంది ..? బాలీవుడ్ లో తన కెరియర్ నిలదొక్కుకోవాలి అంటే ఇలాంటి తప్పులు ఎదుర్కోకుండా ఉండాలి ..ఎందుకు బన్నీ… మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకుండా వైసిపికి సపోర్ట్ చేసి ఇప్పుడు పుష్ప2 ను వాయిదా వేసే స్థాయికి తీసుకొచ్చాడు అంటూ రష్మిక మందన్నా.. కోపంగా ఉందట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది..!!