“బుద్ధి లేక ఆయనతో నటించా”.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ చాలా చాలా బోల్డ్ గా మాట్లాడుతున్నారు. ఉన్న విషయం ఉన్నట్లు చెప్పేస్తున్నారు . అవతల ఉన్నది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ కెరియర్ స్టార్టింగ్ లో బాగా బాగా హిట్స్ అందుకొని.. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల చేత ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోలేకపోతూ ఉండొచ్చు .. హిట్స్ కొట్టలేకపోతూ ఉండొచ్చు.. అయితే ఆ హీరోయిన్స్ మళ్ళీ తమ కెరియర్ని స్టార్ట్ చేసి లైఫ్ని సెటిల్ చేసుకునే పనిలో బిజీగా మారిపోతున్నారు . అదే లిస్టులోకి వస్తుంది మమతా మోహన్ దాస్.

కెరియర్ స్టార్టింగ్ లో బడాబడా హీరోల సినిమాలో నటించింది . ఎలా అంటే బ్యాక్ టు బ్యాక్ వరుసగా పెద్ద పెద్ద స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.. అన్ని సూపర్ డూపర్ హిట్లే . అయితే సడన్గా మమతా మోహన్ దాస్ కి ఫ్లాప్స్ ఎదురయ్యాయి . అంతేకాకుండా ఆమె క్యాన్సర్ వ్యాధికి గురైంది .. చికిత్స కోసం కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైంది . తాజాగా మళ్లీ ఆమె సినిమాలో నటిస్తుంది . పలు తెలుగు మలయాళం సినిమాలలో నటిస్తుంది .

రీసెంట్ గానే విజయ్ సేతుపతి మహారాజ సినిమాలో కూడా నటించింది . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ తాను రజనీకాంత్ తో నటించిన సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది . రజినీకాంత్ తో ఆ సినిమాలో నటించడం నేను తీసుకున్న తప్పుడు నిర్ణయమని .. మొదట పాట కోసం అని చెప్పి నాతో షూట్ చేయించి .. ఆ తర్వాత ఎడిటింగ్ లో నా పాటను లేపేసారని .. కేవలం ఒక్క సెకండ్ ప మాత్రమే నేను తెరపై కనిపిస్తాను అని.. బుద్ధిలేక నటించాను రా దేవుడా అని అనుకున్నాను అని ..ఆమె చెప్పుకు రావడం ఇండస్ట్రీలో షాకింగ్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు మమతా మోహన్ దాస్ చేసిన కామెంట్స్ బాగా బాగా వైరల్ అవుతున్నాయి..!!