టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ పేరు గత కొంతకాలంగా నెటింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ కావడంతో.. ఆమె చర్చ నీయాంసంగా మారింది. తను మొదట రేవ్ పార్టికి వెళ్లలేదని హైదరాబాదులోనే ఉన్నానంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినా.. పోలీసులు విచారణ ఆధారంగా ఆమె అరెస్టు అయింది. ఇక ఈ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారించారు. ఇక ఇటీవల హేమ బెయిల్ పై బయటకు వచ్చింది. ఇక ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదటిలో అమ్మగా, అత్తగా, వదిన పాత్రలో నటించి మెప్పించిన ఈమె స్టార్ హీరోల సినిమాల్లోనూ క్యారెక్టర్ అర్టిస్ట్‌గా నటించి బాగా పాపులర్ అయింది.
కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తేనే రూ.100 కోట్ల అతి ఎలా సంపాదించిందంటూ అందరు సందేహం వ్యక్తం చేశారు. అయితే గతంలో దీనిపై స్పందించిన హేమా మాట్లాడుతూ.. అందరూ అనుకున్నట్లు వందల కోట్ల ఆస్తులు ఏవి నాకు లేవు అంటూ డబ్బు సంపాదన గురించి మాట్లాడుతూ వివరించింది. తనకు డబ్బు సంపాదించడానికి ఉన్న మార్గం సినిమా మాత్రమే కాదని.. మొదటి నుంచి తన కుటుంబం కూడా రిచ్ అంటూ చెప్పుకొచ్చింది. మా అమ్మకి, నాకు ఒంటినిండా నగలు ఉండేవని.. కేవలం సినిమాల మీద ఆధారపడి ఉంటే ఇంత డబ్బు నాకు వచ్చి ఉండేది కాదంటూ వివరించింది.
అలాగే ఊర్లో తనకు చాలా ఆస్తులు ఉన్నాయని.. భర్త కూడా బాగా సంపాదిస్తున్నాడు అంటూ చెప్పింది. తాను కూడా చిట్టి వ్యాపారాలను నడిపిస్తూ ఉంటానని.. డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధం.. కానీ తలదించుకునే పని మాత్రం ఎప్పటికి చేయనంటూ ఆమె వివరించింది. అలాగే ఎంత డబ్బు వచ్చినా గంజినీళ్ళు తాగి బ్రతికేయగలను.. కారడవిలో వదిలేసిన దర్జాగా ఉండగలను.. నాకు లగ్జరీ లైఫ్ అవసరం లేదు అంటూ ఆమె వివరించింది. ఇక ప్రస్తుతం మరోసారిగతంలో హేమా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ ఆమెపై ఫైర్ అవుతున్నారు.