ఓరి ఓరి.. ఈ కన్నప్ప ఫైటర్ గర్ల్ ఆమెనా..? అస్సలు గుర్తుపట్టలేకపోతున్నామే..!

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కన్నప్ప . ఈ సినిమా కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో అందరికీ తెలిసిందే . పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ అందరూ కూడా నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తూ ఉండడం అభిమానులకి సైతం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ప్రభాస్ ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించి మెప్పించబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని లుక్స్ కూడా బయటకు వచ్చేసాయి .

కాగా తాజాగా కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చాలామంది అభిమానులను ఆకట్టుకుంది .ఆఫ్ కోర్స్ నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతున్నప్పటికీ మంచు విష్ణు బాగానే కష్టపడ్డాడు అన్న ప్రశంసలు కూడా దక్కించుకుంటున్నారు . కాగా ఈ టీజర్ మొత్తానికి ఒక గర్ల్ హైలెట్ గా మారింది. అదిరిపోయే రేంజ్ లో కళ్ళు చెదిరే విధంగా ఫైట్ సీన్స్ లో నటించింది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే ఆమె ఎవరో ..?ఆమె ఇంతకుముందు ఏ సినిమాలో నటించింది..? అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు జనాలు.

ఆమె పేరు ప్రీతి ముకుందన్ . క్యాడ్బరీ డైరీ మిల్క్ వంటి వివిధ యాడ్స్ లో యాక్ట్ చేసి మంచి పాపులర్ అయింది .ప్రీతి ముకుందన్ ముట్టు ము2 మ్యూజిక్ ఆల్బమ్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది . కోలీవుడ్ లో రీసెంట్ గా స్టార్ మూవీలో యాక్ట్ చేసింది. ఆ సినిమాతో అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల యంగ్ హీరో శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీలో యాక్ట్ చేసింది ప్రీతి ముకుందన్. ఇప్పుడు కన్నప్పతో పాన్ ఇండియా లెవెల్ లో సందడి చేసేందుకు రెడీ అయింది. చూద్దాం ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో..??