పవన్ కళ్యాణ్ కు మరో అరుదైన గుర్తింపు.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్..!

పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ ఈ పేరు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగి పోతుందో మనం చూసాం . ఆఫ్ కోర్స్ అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ పేరు బాగా ట్రెండ్ అయ్యేది. కానీ పవన్ కళ్యాణ్ అనుకున్న పని సాధించిన తర్వాత ఆయనను ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. కాగా ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న ఒక నిర్ణయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిదా చేసేస్తుంది.

కొత్త అధికారం చేపట్టాక.. పాత గవర్నమెంట్ తాలూకాకి సంబంధించిన ఫొటోస్ అన్నీ తీసేసి కొత్త గవర్నమెంట్ కి సంబంధించిన పిక్స్ పెడుతూ ఉంటారు. ప్రజెంట్ పలు ప్రభుత్వ కార్యాలయాలలో అన్నిట్లోనూ చంద్రబాబుకు సంబంధించిన ఫొటోస్ పెట్టేసారు . అయితే చంద్రబాబు నాయుడు తన ఫొటోస్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫొటోస్ కూడా పక్కనే అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో ఉండేలా కొత్త రూల్ తీసుకొచ్చారట .

ఇప్పటికే అధికారులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇకపై మనం ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లినా సరే పవన్ కళ్యాణ్ ఫోటో నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కపక్కనే చూస్తాము. ఈ మూమెంట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఏపి పొలిటికల్ హిస్టరీలో గేమ్ చేంజర్ గా మారిపోయాడు పవన్ కళ్యాణ్..అందుకే చంద్ర బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడు..!!