అమ్మ బాబోయ్ .. “కల్కి” సినిమాపై ఈ రేంజ్ లో బెట్టింగ్ జరుగుతుందా..? ఐపిఎల్ ని మించిపోయే రేంజ్ లో ఉందిగా..!

సాధారణంగా బెట్టింగ్స్ అంటే క్రికెట్ మ్యాచ్ల పైన ఎక్కువగా ఉంటాయి. మరి ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ లో ఎటువంటి బెట్టింగ్స్ కి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారో మనందరికీ బాగా తెలిసిన విషయమే . అయితే ఇప్పుడు కేవలం క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి కాదు ఎటువంటి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న విషయాలపై అయినా బెట్టింగ్స్ వేసేందుకు సిద్ధపడుతున్నారు జనాలు . తాజాగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడు అని కొంతమంది ఓడిపోతారు అని ఏకంగా కోట్లలో బెట్టింగ్ వేసిన విషయం తెలిసిందే.

కాగా రీసెంట్గా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ నటించిన కల్కి సినిమాపై అలాంటి బెట్టింగే జరుగుతుంది . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా కల్కి . ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాపై జనాలు ఎలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అనే దాని గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .

కాగా రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా హిట్ అవుతుంది అని కొంతమంది ఫ్లాప్ అవుతుంది అని బెట్టింగ్స్ వేస్తున్నారు . కేవలం వందలు వేలల్లో కాదు లక్షల్లో కూడా బెట్టింగ్స్ వేస్తూ ఉండడం గమనార్హం. ప్రభాస్ స్థాయి ఆ రేంజ్కి ఎదిగిపోయింది . మరి మీరేమనుకుంటున్నారు కల్కి సినిమా హిట్ అవుతుందనుకుంటున్నారా..? లేకపోతే ఆవరేజ్ గా నిలుస్తుంది అనుకుంటున్నారా..? కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ ని తెలియజేయండి..!