పవన్ చేస్తున్న ఈ వారాహి అమ్మవారి దీక్ష ఎంత పవర్ ఫుల్ అనేది తెలుసా..? ఎందుకు చేస్తారు అంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా మారు మ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు . డిప్యూటీ సీఎం అయిన వెంటనే తన అధికారాన్ని చేపట్టి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నారు. జూన్ 25వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష 11 రోజులపాటు చేయనున్నారు .

కాగా దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు – పండ్లు – ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ చాలా నిష్ట నియమాలతో ఈ వారాహి అమ్మవారి దీక్షను చేస్తున్నారు. అయితే ఈ మూమెంట్లోని వారాహి అమ్మవారు ఎవరు ..? ఎందుకు ఈ పూజలు చేస్తారు..? అనే విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి .

మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతిరూపాలు గా సప్త మాతృకలు ఉంటారు . ఆ సప్తమాతృకంలో ఒకరే వారాహి అమ్మవారు . అమ్మవారి రూపంలో వారాహి ముఖంతో ఎనిమిది చేతులతో పాసం – నాగలి – శంఖచక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తూ ఉంటుంది . వారాహి అమ్మవారు లలిత దేవి పై సైన్యాధిపతి. కావున ముఖ్యంగా శత్రుభయం ఉండకూడదు అని ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి జీవితంలో ముందుకు వెళ్లడానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రజెంట్ వారాహి అమ్మవారి దీక్షకు సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!