అప్పుడు సమంత కోసం ఇప్పుడు ఈ హీరోయిన్ కోసం ..నాగచైతన్య త్యాగాలు మామూలుగా లేవుగా..!

పాపం నాగచైతన్య ..చాలా సైలెంట్ పర్సన్ ..ఎప్పుడు కూడా కోప్పడిన సందర్భాలు లేవు ..ఎవరిని కూడా వేలెత్తి చూపించి నిందించిన దాఖలాలు లేవు.. తన పని తాను చూసుకో పోతూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఎంతటి హ్యూజ్ ట్రోలింగ్ జరిగినా సరే నాగచైతన్య అస్సలు పట్టించుకోడు . ఆయన పని ఆయన చూసుకుంటూ ఉంటాడు . అయితే ఏం మాయ చేసావే సినిమా టైంలో నాగచైతన్య చాలా రిస్క్ చేశాడు . అప్పుడప్పుడే కెరియర్ లో సెటిల్ అవుతూ ఉన్న నాగచైతన్య ..ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర హైలెట్ అవుతుంది అని తెలిసినా కూడా నాగచైతన్య హీరోగా నటించాడు .

అయితే ఆ టైంలో సమంత పేరు మారు మ్రోగిపోవడానికి కారణం నాగచైతన్య అంటూ బాగా ప్రచారం జరిగింది . ఇప్పుడు అదే తప్పును మరోసారి చేయబోతున్నాడు నాగచైతన్య అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . నాగచైతన్య ప్రెసెంట్ తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . నిజానికి ఈ సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్ కన్నా సాయి పల్లవి క్యారెక్టర్ ని హైలైట్ గా ఉండబోతుందట .

ఆ విషయం నాగచైతన్యకి కూడా బాగా తెలుసు అంట . అయితే ఏం మాయ చేసావే సినిమాకి తీసుకున్న డెసీషన్ నే..ఈ సినిమాకి తీసుకున్నాడు నాగచైతన్య అంటూ ప్రచారం జరుగుతుంది . తన క్యారెక్టర్ హైలెట్ కాకపోయినా పర్లేదు తన మనసుకు నచ్చిన పాత్ర చేయాలి అంటూ డిసైడ్ అయ్యి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారట . దీంతో అప్పుడు సమంత కోసం ఇప్పుడు సాయి పల్లవి కోసం నాగచైతన్య తీసుకున్న నిర్ణయం వైరల్ గా మారింది..!