సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు ట్రెండ్ మార్చేస్తూ ఉంటారు. కేవలం ఒక భాష ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ అదే ఇండస్ట్రీలో నటిస్తే కిక్కేముంటుంది పక్క భాష ఇండస్ట్రీలో కూడా నటిస్తేనే సూపర్ గా ఉంటుంది. అప్పుడే హిట్ అందుకున్న అసలైన మజా . ఈ స్ట్రాటజీలను చాలా మంది హీరోయిన్స్ ఫాలో అవుతున్నారు . ఇప్పుడు తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది బాలీవుడ్ హాట్ సెక్సీ బ్యూటీ సారా అలీ ఖాన్ .
స్టార్ డాటర్ అయినప్పటికీ ఏం మాత్రం హై రేంజ్ హెడ్ వెయిట్ చూపించకుండా చాలా చాలా కూల్ అండ్ క్లాసిక్ మైండ్ తో ముందుకెళ్ళిపోయే సారా అలీ ఖాన్..బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్.. తోపైన బ్యూటీ.. ఎలాంటి పాత్రలను అయినా సరే అవలీలగా నటించేయగలరు . ఈ మధ్యకాలంలో ఆమె పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది . అయితే ఇప్పుడు ఈ బ్యూటీ తన కన్నును టాలీవుడ్ పై వేసినట్లు తెలుస్తుంది .
టాలీవుడ్ ఇండస్ట్రీలో బడాబడా అవకాశాలలో ఆమె ఛాన్సెస్ అందుకుంటుందట. అయితే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంద. అల్లాటప్ప హీరోల సరసన కాకుండా తోపైన హీరోల సరసన నటించబోతుందట . అందుతున్న సమాచారం ప్రకారం..వెట్రిమారన్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కే సినిమాలో సారా అలీ ఖాన్ ని హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే అమ్మడు లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటున్నారు అభిమానులు. అందుకే సారా అలీఖాన్ కూడా వేయడం వేయడమే పెద్ద స్టార్ కే టెండర్ వేసింది అంటున్నారు . చూద్దాం మరి ఏ రేంజ్ లో ఈ బ్యూటీ ప్లాన్స్ సక్సెస్ అవుతాయో..?