అలాంటి ఫొటోస్ తో సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోయిన నాగచైతన్య.. ఇక దేవుడు కూడా కాపాడలేడుపో..!


ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నాగచైతన్య పేరు ఎలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నప్పటినుంచి ఆయన పేరు ఇండస్ట్రీలో రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. కాగా కొద్ది నెలల నుంచి శోభిత ధూళిపాళతో ఆయన డేటింగ్ చేస్తున్నాడు అని త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు అని ..అక్కినేని ఇంటికి కోడలు కాబోయేది శోభిత నేనని బాగా చర్చలు జరుగుతున్నాయి .

దానికి తగ్గట్టే సోషల్ మీడియాలో వీళ్ళకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. కాగా రీసెంట్గా మరోసారి అడ్డంగా బుక్ అయింది ఈ జంట . యూరప్ లో జరుగుతున్న వైన్ ఫెస్టులో ఈ జంట కనిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఫోటోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి . దీంతో ఈ జంట ప్రేమాయణం కొనసాగిస్తుంది అన్న వార్త నిజమే అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు. అక్కినేని అభిమానులు సైతం అక్కినేని ఇంటికి కోడలు కాబోయేది శోభిత ధూళిపాళ నే అంటూ క్లారిటీకి వచ్చేసారు.

అంతేకాదు ఇక దేవుడు కూడా ఈ జంటను విడదీయలేరు అంటూ బాగా డీప్ గా కనెక్ట్ అయిపోయి కామెంట్స్ పెడుతున్నారు. అయితే దీనిపై నాగచైతన్య కానీ శోభిత ధూళిపాల కానీ ఏ విధంగా పాజిటివ్గా స్పందించడం లేదు . ఎప్పటికప్పుడు మా మధ్య ఏదీ లేదు అన్న రేంజ్ లోనే బుకాయిస్తున్నారు. కానీ పెట్టే పోస్టులు మాత్రం పరోక్షంగా ప్రేమను తెలియజేస్తున్నాయి . చూద్దాం మరి ఎన్నాళ్లు ఈ ప్రేమను దాచుకుంటారో ఈ జంట..?