అదే జరిగితే రాజమౌళికి భారీ బొక్క తప్పదా..? ఇలా ఇరుక్కునేశాడు ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరు అనగానే అందరూ కళ్ళు మూసుకొని చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి . ఈ విషయం అందరికీ తెలిసిందే . రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. ఆయన సినిమాలు తెరకేక్కిస్తే సూపర్ డూపర్ హిట్ అవుతాయి అన్న నమ్మకం అందరిలోనూ ఉంది . మరీ ముఖ్యంగా రాజమౌళి పేరు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతూ ఉంటుంది . కాగా రీసెంట్గా రాజమౌళికి సంబంధించిన ఒక వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. రాజమౌళి తర్వాత ఇండస్ట్రీలో ఆ స్థానాన్ని అందుకునే టాప్ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది.

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఇదే న్యూస్ టాప్ రేంజ్ లో ట్రెండ్ అవ్వడం గమనార్హం. అందుతున్న సమాచారం ప్రకారం జనాల ఒపీనియన్ ప్రకారం రాజమౌళి తర్వాత ఆయన స్థానాన్ని అందుకునే ఛాన్సెస్ నలుగురు డైరెక్టర్లు ఉన్నాయి అంటున్నారు జనాలు . వాళ్ళు మరెవరో కాదు ప్రశాంత్ వర్మ – సందీప్ రెడ్డి వంగ – సుజిత్ – నాగ్ అశ్వీన్.. ఎస్ మహానటి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన నాగ్ అశ్వీన్ కూడా రాజమౌళి రేంజ్ లో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు అని.. కల్కితో అది మరోసారి ప్రూవ్ కాబోతుంది అంటున్నారు రెబల్ ఫ్యాన్స్ ,

అదేవిధంగా అర్జున్ రెడ్డి తో అనిమల్ సినిమాలతో తోపైన డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ కూడా అదే లిస్టులోకి రాబోతున్నాడు అంటున్నారు జనాలు. ఆ తర్వాత సాహో సినిమాతో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అని.. త్వరలోనే మంచి స్థానం అందుకుంటాడు అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు హనుమాన్ సినిమాతో తన సినిమా స్టామిన చూపించిన ప్రశాంత్ వర్మ సైతం రాజమౌళి స్థానం అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. వీళ్లలో ఏ డైరెక్టర్ అయినా సరే రాజమౌళి కన్నా ఒక్క స్టెప్ ముందుకేసి భారీ రిస్క్ చేస్తే రాజమౌళి సెకండ్ స్థానానికి వెళ్లిపోవడం పక్క అంటున్నారు సినీ విశ్లేషకులు..!!