బుజ్జి ఈవెంట్ కోసం ప్రభాస్ అన్ని డేస్ కష్టపడ్డాడా..? అలాంటి రిస్కులు కూడా చేశాడా..?

లైఫ్ లో ఎప్పుడూ మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూ ఉండవు. అది అందరికీ తెలిసిందే . ఏమైనా సరే కొన్ని కొన్ని సార్లు మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడే మనం స్ట్రాంగ్ గా నిల్చోవాలి.. రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు మారుమ్రోగిపోతుంది .

ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కమిట్ అయిన సినిమాల కోసం ఎంత కమిట్మెంట్ గా వర్క్ చేస్తాడో తెలిసిందే. రీసెంట్గా ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా కోసం తీవ్ర స్థాయిలో కష్టపడ్డాడు ప్రభాస్ . అంతేకాదు సినిమాలోని స్పెషల్ పర్సన్ పరిచయం చేస్తూ బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఓ గ్రాండ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేశారు . ఆ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది . అయితే కేవలం నాలుగు నుంచి ఆరు గంటల వరకే ఆ ఈవెంట్ జరిగింది.

కానీ ఈ ఈవెంట్ కోసం ప్రభాస్ దాదాపు 15 రోజులు రోజుకి ఐదు గంటల చొప్పున కష్టపడ్డారట . భారీ భారీ స్టంత్స్ చేయడం కోసం బాగా ప్రాక్టీస్ చేశాడట ప్రభాస్ . షూట్లో ఎవరైనా సరే సెక్యూరిటీ మధ్య అలాంటి స్టంత్స్ చేస్తారు ..కానీ అంతమంది జనాభా బార్కేడ్ల మధ్యలో అలా స్టంత్స్ చేయడం అనేది చాలా రిస్కీ ప్రాసెస్ . ఏం మాత్రం తప్పు జరిగిన సరిదిద్దుకోలేని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది . ఈ క్రమంలోనే నాగ్ అశ్వీన్ ప్రభాస్ చాలా కేర్ఫుల్ గా స్టంత్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!!