కుటుంబం గురించి ఆలోచించకుండా పవన్ కోసం లక్షలు ఖర్చు చేశా.. కానీ.. షకలక శంకర్ షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్.. వీరాభిమానుల‌లో షకలక శంకర్ కూడా ఒకడు. కాగా ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంక‌ర్‌.. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో గతంలో ఏకంగా రూ.7లక్షలు ఖర్చు చేశాను అంటూ షాకింగ్ విష‌యాల‌ను రివీల్ చేశాడు. 2019 ఎన్నికల టైంలో రెండు సినిమాల అడ్వాన్సులు వచ్చాయని.. ఆ టైంలో తుఫాను బాధితులకు భోజనాలు ఏర్పాటు చేశామని.. అప్పుడే జనసేన ప్రచారం కోసం కూడా ఖర్చు చేశానని ష‌కలక శంకర్ వివరించాడు. నా కుటుంబం నేను డబ్బులు తెస్తానని ఎదురు చూశారని.. కానీ ఆ డబ్బులు నేను ఖర్చు చేశానని ఆయ‌న‌ వివరించాడు.

Shakalaka Shankar 👌👌👌🥛🥛🥛, election campaign at Anakapalli , Konathala Ramakrishna, 🗳️ #VoteForGlass 🥛🙏, #JanasenaParty #PawanKalyan, #VoteForNDA☝️#HelloAP_ByeByeYCP👋 , #AllianceForABetterFuture ✊, ...

నేను చేసింది తప్పుకాదని.. అయితే వాళ్లకు నేను చెప్పేది అర్థం కాక.. నాలుగు రోజులు నా భార్య నాతో మాట్లాడలేదంటూ వివరించాడు. మా మామయ్య.. పవన్ కోసం అంత ఖర్చు చేస్తే.. పవన్ ఏమైనా ఫోన్ లేదా మెసేజ్ కూడా చేయలేదు అనిభావించార‌ని.. శంకర్ చెప్పుకొచ్చాడు. నేను చిరంజీవి, పవన్ తో సినిమాలు చేసినా.. వాళ్లతో ఫోటోలు ఎప్పుడు అడగలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ టైంలో నేను చేసింది పవన్ కు తెలుసా.. అని అనిపించిందని.. అభిమానంతో సేవ చేయాలనిపించి అవ‌ని చేశా ఆయన వివరించాడు.

భార్య, పిల్లల గురించి ఆలోచించకుండా పవన్ కోసం అన్ని లక్షల ఖర్చు చేశా.. చివరకు

అయితే 2024 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను కానీ నా డబ్బులు అయితే ఖర్చు చేయలేదు అంటూ వివరించాడు. పవన్ పై అభిమానంతో మాత్రమే నేను మాట్లాడాను అని చెప్పిన ఆయన.. ఒకరిపై ఒకరు విమర్శ‌లు చేసుకోవడం రాజకీయం అనిపించుకోదని.. నేను కేవలం పవన్ కు ఓటేయాలని ఆయన గురించి మాత్రమే చెప్పానంటూ వివరించాడు. కాగా ప్ర‌స్తుతం షకలక శంకర్ చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ప్ర‌చారం చేయ‌డ‌మే కాకుండా మీ డ‌బ్బు కూడా ఖ‌ర్చుపెట్టారంటే మీకు ఆయ‌న‌పై ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.