మోడీ బయోపిక్ లో సత్యరాజ్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ నటుడు..?!

సౌత్ స్టార్ నటుడు సత్యరాజ్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియాలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాహుబలి తో సత్యరాజ్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో సత్యరాజ్ కట్టప్ప పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో గత కొంతకాలంగా సత్యరాజ్ మన ప్రధాని మోడీ బయోపిక్ లో నటిస్తున్నాడంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Did you know? Sathyaraj was NOT the FIRST choice to play 'Kattappa' in ' Baahubali'!

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన సత్యరాజ్ ఈ విషయంపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూప్రధాని మోడీ బయోపిక్ లో తను నటించడం లేదంటూ.. అలాంటి వార్తలో ఎటువంటి నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయంలో ఇప్పటివరకు తనని ఎవరు సంప్రదించలేదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మోడీ బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే నేను రిజెక్ట్ చేస్తానని.. తన సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన సినిమాలలో నటించలేనంటూ చెప్పుకొచ్చాడు.

Sathyaraj Wiki, Height, Biography, Early Life, Career, Age, Birth Date,  Marriage

ఈ క్రమంలో మీడియా సంస్థలు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యరాజ్ మాట్లాడుతూ ఈ వార్తల నాకే ఆశ్చర్యాన్ని కల్పించాయి.. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయడం మానుకోండి.. భవిష్యత్తులో మోడీ బయోపిక్ కోసం నన్ను ఎవరైనా సంప్రదించిన నేను ఆ బయోపిక్ చేసే అవకాశం లేదు.. నో చెప్పేస్తా ఎందుకంటే.. ఈ సినిమా నా భావజాలానికి, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. అందుకే నేను ఈ సినిమాలో నటించిన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సత్యరాజ్ చేసిన కామెంట్లు వైర‌ల్ కావ‌డంతో ఇప్పటి వరకు మోడీ పాత్రలో సత్య‌రాజ్‌ నటిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలకు ఒక్కసారిగా చెక్ ప‌డింది.